Connect with us

Blood Drive

Milwaukee, Wisconsin: ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహణ

Published

on

Milwaukee, Wisconsin, June 1, 2026: తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ , తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (NTR) 103వ జయంతి సందర్భంగా మిల్వాకీ తెలుగు వాళ్ళు రక్తదాన శిబిరం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో 25 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేసి ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించారు. ప్రవాసాంధ్రులు, ఎన్టీఆర్ (Nandamuri Taraka Rama Rao) అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ సేవా కార్యక్రమం విజయవంతమైంది.

రక్తదానం ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడే అవకాశముందని, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలతో ఎన్టీఆర్ (NTR) ఆశయాలను కొనసాగించడం తమ బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమం విజయవంతానికి సహకరించిన రక్తదాతలు, స్వచ్ఛంద సేవకులు, స్థానిక తెలుగు అభిమానులకి కృతజ్ఞతలు తెలిపింది.

ఈ కార్యక్రమంలో తన వంతుగా గిఫ్ట్ కార్డ్ అందచేసిన ఆహా ఇండియన్ క్యూసిన్ (AHA Indian Cuisine) యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది. ఎన్టీఆర్ (NTR) జయంతిని సేవా కార్యక్రమంతో నిర్వహించడం ద్వారా ఆయనకు ప్రత్యేకంగా నివాళులర్పించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected