Connect with us

Convention

‘ఆటా’ ఆధ్వర్యంలో విజయవంతంగా మదర్స్ డే సెలబ్రేషన్స్ – శాండియాగో & వర్జీనియా

Published

on

అమెరికా తెలుగు సంఘం ‘ఆటా’ అధ్యక్షులు భువనేష్ బుజాల, కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు మరియు అన్ని కమిటీల సభ్యులు వాషింగ్టన్ డీసీ లో మూడు రోజులపాటు జూలై 1-3, 2022 జరగనున్నఆటా 17వ కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ కొరకు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు.

ఆటా అధ్యక్షులు భువనేశ్ భుజాల మాట్లాడుతూ జులై 1 నుండి జులై 3 వరకు జరగనున్న ఆటా కన్వెన్షన్ మరియు యూత్ కాన్ఫరెన్స్ సందర్భంగా అన్ని కమిటీల సభ్యులు పరస్పరం సహకరించుకొని ఈ ఆటా 17వ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు ఒక్కొక్క కమిటీ ల సభ్యుల వివరాలు అడిగి తెలుసుకొన్నారు.

మే 8, 2022 ఆదివారం రోజు న మదర్స్ డే ని పురస్కరించుకొని కాన్ఫరెన్స్ కల్చరల్ ఛైర్‌ దీపికా బుజాల, కాన్ఫరెన్స్ కల్చరల్ అడ్వైజరీ సాయికంత రాపర్ల, కాన్ఫరెన్స్ సయ్యంది పాదం ఛైర్‌ సుధా రాణి కొండపు మరియు మహిళా స్పోర్ట్స్ కో-ఛైర్‌ ప్రశాంతి ముత్యాల అందరూ వర్జీనియాలో కేక్ కట్ చేసి ఘనంగా సెలబ్రేట్ చేసుకొన్నారు.

అలాగే కాలిఫోర్నియాలోని శాండియాగో లో వుండే ఆటా మహిళలు అందరూ కేక్ కట్ చేసి మదర్స్ డే ని విజయవంతంగా సెలబ్రేట్ చేసుకొన్నారు. ఆటా 17వ మహాసభల మరిన్ని వివరాలకు www.ataconference.org చూడండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected