Connect with us

Convention

ఆటా ‘ఝుమ్మంది నాదం’ పాటల పోటీలు, వర్థమాన గాయకులకు మంచి వేదిక

Published

on

అమెరికా తెలుగు సంఘం ‘ఆటా’ అధ్యక్షులు భువనేష్ బుజాల, కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు మరియు అన్ని కమిటీల సభ్యులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమెరికా రాజధాని నగరం నడిబొడ్దున వాషింగ్టన్ డి సి లో మూడు రోజులపాటు జూలై 1-3, 2022 జరగనున్న ఆటా 17వ మహాసభలను పెద్ద ఎత్తున 10,000 మందికి పైగా హాజరయ్యె విధంగా సన్నాహాలు చేస్తున్నారు.

ఇందులో భాగంగా ‘ఝుమ్మంది నాదం’ అంటూ పాటల పోటీలు నిర్వహిస్తున్నారు. ఆటా వారి ఈ కార్యక్రమం వర్థమాన గాయకులకు మంచి వేదిక అవ్వనున్నది. అన్ని వయస్సులు వారికీ పోటీల్లో పాల్గొనే అద్భుత అవకాశం దక్కనుంది. జూలై 1 నుంచి 3 వరకు ఆటా మెగా కన్వెన్షన్‌ వేదికగా జరగనున్న ఫైనల్స్ హైలైట్స్ కానున్నాయి.

ఇంకెందుకు ఆలస్యం ‌మీ నాదంతో సప్తస్వరాలు పలికించండి, ఆటా ఝుమ్మంది నాదం 2022 విజేతలుగా నిలవండి. స్టార్ సెలెబ్రెటీస్ చేతుల మీదుగా అవార్డు ప్రధానోత్సవం. మీ ఆడిషన్ ఎంట్రీ రిజిస్టర్ చేసుకోవడానికి www.ataconference.org/events-registrations ని సందర్శించండి. అలాగే మహాసభల వివరాలకు www.ataconference.org ని సందర్శించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected