Houston, Texas: హ్యూస్టన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ (TCA) స్వర్ణోత్సవ వేడుకల ఏర్పాట్లు అత్యంత వేగంగా కొనసాగుతున్నాయి. సుమారు 30 కమిటీలు మరియు 150కి పైగా వాలంటీర్లు, గత 3 నెలలుగా సూక్ష్మ ప్రణాళికతో, పాల్గొనే ప్రతి ఒక్కరికి మరపురాని అనుభూతిని అందించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు.
ఈ చారిత్రాత్మక వేడుకలకు
యాదగిరి రెడ్డి గారు – అధ్యక్షులు
జితేందర్ రెడ్డి గారు – కన్వీనర్
సమర్థ నాయకత్వం వహిస్తూ మరియు టీసీఏ (TCA) కన్వెన్షన్ కోర్ టీమ్ మెంబర్స్ ముందుండి కార్యక్రమాలను సమన్వయం చేస్తున్నారు.
తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు, సంగీతం, సాహిత్యం, వినోద కార్యక్రమాలతో రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్న ఈ స్వర్ణోత్సవాల్లో ప్రతి తెలుగు కుటుంబం పాల్గొని విజయవంతం చేయాలని హ్యూస్టన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ (Houston Telugu Cultural Association – TCA) కుటుంబం హృదయపూర్వక ఆహ్వానం అందిస్తోంది.
“50 సంవత్సరాల సేవ… తెలుగు ఐక్యతకు స్వర్ణయుగ వేడుక”. ఇది కేవలం స్వర్ణోత్సవం (Golden Jubilee Celebrations) మాత్రమే కాదు… ఇది 50 ఏళ్ల తెలుగు ఐక్యత, సేవా ప్రస్థానానికి ఘన నివాళి. వేదిక: Fort Bend Epicenter, తేదీలు: ఆగస్టు 7 & 8, 2026