Connect with us

Festivals

Telugu Fine Arts Society @ New Jersey: ఘనంగా ఉగాది వేడుకలు & పురస్కారాలు

Published

on

. 2026 ఉగాది వేడుకలు, పురస్కారాలు అమెరికాలోని న్యూజెర్సీ (New Jersey) లో తెలుగు కళాసమితి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగాయి.

. ముఖ్య అతిథిలుగా హాజరైన పద్మభూషణ్ శ్రీ డా.నోరి దత్తాత్రేయుడు (Dr. Dattatreyudu Nori), శ్రీ ఉపేంద్ర చివుకుల, మిర్చియార్డు మాజీ చైర్మన్ శ్రీ మన్నవ సుబ్బారావు, సంగీత దర్శకులు శ్రీఆర్పీ పట్నాయక్

. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తెలుగు కళాసమితి అధ్యక్షులు మధుసూధనరావు అన్నా

. TFAS మాజీ అధ్యక్షులు శ్రీ దాము గేదెల సేవలను గుర్తించి జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం

New Jersey: 2026 ఉగాది వేడుకలు, పురస్కారాలు అమెరికాలోని న్యూజెర్సీలో తెలుగు కళా సమితి (Telugu Fine Arts Society) ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ నోరి దత్తాత్రేయుడు మాట్లాడుతూ.. భాషే సాంస్కృతిక వారధి అని అన్నారు.

ఒక జాతి అస్థిత్వాన్ని, ప్రత్యేకతను చాటిచెప్పేది మాతృభాషలేనని తెలిపారు. తెలుగువారి సమక్షంలో ఈ ఉగాది పురస్కారం (Ugadi Awards) అందుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు ఇద్దరూ వైద్య ఆరోగ్య రంగానికి ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమించారని తెలిపారు.

తెలుగు కళాసమితి అధ్యక్షులు శ్రీ మధు అన్నా (Madhu Anna) మాట్లాడుతూ.. తెలుగుకళా సమితి ఆశయాలు, విలువల గురించి ప్రస్తావిస్తూ తనకు దక్కిన రెండు సంవత్సరాల సేవను ఎంతో సంతోషంగా, బాధ్యతగా నిర్వహించానన్నారు. మన్నవ సుబ్బారావు (Mannava Subbarao) మాట్లాడుతూ.. తెలుగువారి సంస్కృతిని, వారసత్వ సంపదను టీఎఫ్ఏఎస్ పరిరక్షిస్తున్నందుకు కార్యవర్గ సభ్యులను అభినందించారు.

ఆర్పీ పట్నాయక్ (RP Patnaik) మాట్లాడుతూ.. మాతృభాషను విస్మరించిన ఏ జాతి కూడా మనుగడను సాగించలేదన్నారు. ఈ వేడుకలను పురస్కరించుకుని ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఫోటో ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. శ్రీమతి కోకిల మంజులశ్రీ పంచాంగ శ్రవణం చేశారు.

శ్రీచిట్టి శర్మ గారు వేద పఠనం చేసారు. ఎన్నో విశేషాలతో ప్రచురితమవుతున్న తెలుగుజ్యోతి పత్రిక గురించి కుమార్ తాడేపల్లి వివరించారు. ప్రవాసాంధ్రుల సంప్రదాయ వస్త్రధారణతో నిర్వహించిన ప్రదర్శన ప్రశంసలందుకుంది. TFAS సంస్థలో ముఖ్యులైన పెద్దలు శ్రీమతి రాధ కాశీనాధుని, శ్రీమతి రేణు తాడేపల్లి, శ్రీ T.P. రావు, శ్రి రాజారావు బండారు, శ్రి రవిక్రిష్ణ అన్నదానం పాల్గొన్నారు.

2026-28 కి అధ్యక్షురాలు గా ఎన్నికైన శ్రీమతి ఉమా మాఖం మరియు ఆమె 8 మంది కార్య వర్గ సభ్యుల చేత శ్రీ సుధాకర్ ఉప్పల (Sudhaker Uppala) గారు ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రి మధు అన్నా ని కళాసాంస్కృతిక సార్వభౌమ బిరుదుతో సత్కరిస్తూ జీవన సాఫల్య పురస్కారం ఇవ్వాలని పలువురు వక్తలు కోరారు.

స్వర సామ్రాట్, డా.టీ శరత్ చంద్ర, రంగస్థల కళాకారులు అశోక్ చింతకుంటలను ఉగాది పురస్కారాలతో సత్కరించారు. ప్రత్యేక అతిథులుగా భాను మాగులూరి, శ్రీ శ్రీ అట్లూరి, శ్రీమతి స్వాతి అట్లూరి (Swathi Atluri), శ్రీ మోహన్ పటలోల, శ్రీహరి మందడి (Srihari Mandadi), శ్రీ శ్రీనివాస్ గనగోని, శ్రీ కిరణ్ దుద్దగి, శ్రీ రాజా కసుకుర్తి (Raja Kasukuthi), శ్రీభాస్కర్ భూపతి, శ్రీ సురేష్ చాటకొండు, శ్రీ రవి నిమ్మా, శ్రీనివాస్ భీమినేని తదితరులుపాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో 2024-26 టీఎఫ్ఏఎస్ (Telugu Fine Arts Society) కార్యవర్గ సభ్యులైన సత్య వెంకటతాతా, ప్రసాద్ ఊటుకూరి, శ్రీమతి వాణి కూనిశెట్టి, శేషగిరిరావు కంభంనెట్టు, అరుంధతి శావెల్లి, శ్రీమతి వరలక్ష్మి రాధాకృష్ణ, శ్రీమతి లత మాదిశెట్టి, లోకేందర్ గిర్కల పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected