Connect with us

Elections

వారాంతంలో టీం గోగినేని ఎలక్షన్ ప్రచారం @ Dallas & Austin

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America – TANA) ‘తానా’ ఎలక్షన్స్ లో తమ టీం ని గెలిపించాలని టీం గోగినేని సభ్యులు గత వారాంతం మే 13, 14 తేదీల్లో టెక్సస్ రాష్ట్రంలోని డల్లాస్ & ఆస్టిన్ నగరాల్లో ప్రచారం నిర్వహించారు.

ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీనివాస్ గోగినేని ఆధ్వర్యంలోని ప్యానెల్ కోసం డల్లాస్ లోని స్థానిక సపోర్టర్స్ మరియు పోటీదారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిసింది. టీం గోగినేని తరపున డల్లాస్ లో ఇది మొట్టమొదటి కార్యక్రమం.

పోటీదారులందరూ తాము చేసిన సేవలు వివరించి తమకు ఓటు వేయాలని ఆహ్వానితులను కోరారు. టీం గోగినేని ప్రమోషన్ వీడియోలు ప్రదర్శించారు. అలాగే జయ్ తాళ్లూరి, సతీష్ వేమూరి, మురళి వెన్నం తదితరులు ఈ ప్యానెల్ కి సపోర్ట్ గా ప్రసంగించారు.

ఈ సందర్భంగా పులువురు పోటీదారులు టీవీ9, టీవీ5 మరియు మన టీవీ విలేఖరులతో మాట్లాడారు. దాదాపు శ్రీనివాస్ గోగినేని ప్యానెల్ లోని అందరూ ఈ తానా ఎలక్షన్స్ ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక సిల్వర్ స్టార్ ఈవెంట్ సెంటర్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

అలాగే టెక్సస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో కూడా అదే వారాంతం టీం గోగినేని మీట్ అండ్ గ్రీట్ లో భాగంగా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. వరుసగా డల్లాస్, ఆస్టిన్ నగరాలలో ప్రచారం నిర్వహించడంతోపటు వచ్చే వారాంతం అట్లాంటాలో ప్రచారం నిర్వహించేలా ప్రణాళిక రచించినట్లు తెలిసింది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected