Connect with us

Elections

Flash News: నరేన్ కొడాలి ప్యానెల్ కి పట్టం కట్టిన తానా ఓటర్లు

Published

on

. గోల్డెన్ జూబిలీ అధ్యక్షునిగా నరేన్ కొడాలి
. టీం కొడాలి ప్యానెల్ దాదాపు క్లీన్ స్వీప్
. ముందే చెప్పిన NRI2NRI.COM
. 5 RR లు & 2 డోనార్ ట్రస్టీలు టీం వేమూరి కైవసం
. ముచ్చటగా మూడోసారి ఎన్నికలు
. ఒక సంవత్సర కాలం కాలగర్భంలో

అమెరికా అంతటా రెండు నెలల హోరాహోరీ ఎలక్షన్ క్యాంపైన్, తర్వాత సై అంటే సై అంటూ మూడు వారాల ఓట్ల పోలింగ్, చివరిగా ఈరోజు సియాటిల్ (Seattle) లో కౌంటింగ్. కట్ చేస్తే 2023-25 కాలానికి నరేన్ కొడాలి ప్యానెల్ (Naren Kodali Panel) కి పట్టం కట్టిన తానా ఓటర్లు.

వివరాలలోకి వెళితే… 2023-25 కాలానికి నిర్వహించిన మొదటి ఎలక్షన్స్ సమయలేమి కారణంగా రద్దవడం, రెండవసారి అందరూ కాంప్రమైజ్ అయ్యి సెలెక్షన్ ప్రాసెస్ ద్వారా ఎన్నికయినప్పటికీ కోర్టు వాటిని రద్దు చేయడంతో రీసెంట్ గా ముచ్చటగా మూడోసారి తానా ఎన్నికలు (TANA Elections) నిర్వహించారు.

ఈ మొత్తం ప్రాసెస్ లో దాదాపు ఒక సంవత్సర కాలం కాలగర్భంలో కలిసిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే తానా లో స్తబ్దత నెలకొంది. కోర్టు కేసులు, దూషణల పర్వం వంటి వాటిని దాటుకొని, ఎట్టకేలకు ఎన్నికలు ముగియడంతో తానా సభ్యులు సైతం క్యాంపైన్ (Election Campaign) గోల తప్పిందంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు.

ఇప్పటి వరకు తానా (Telugu Association of North America – TANA) చరిత్రలో ఎప్పుడూ నిర్వహించని, సవాలుతో కూడిన ఎలక్ట్రానిక్ వోటింగ్ (Electronic Voting) పద్దతిలో ఈ ఎలక్షన్స్ నిర్వహించడంతో, ఫలితాలపై అమెరికాలోని తెలుగువారు కూడా ఒకింత కుతూహలం వ్యక్తం చేస్తూ వచ్చారు.

నరేన్ కొడాలి (Naren Kodali) సారధ్యంలోని టీం కొడాలి ప్యానెల్ మొదటి నుంచి చెప్తున్నట్టే క్లీన్ స్వీప్ చేసి పైచేయి సాధించింది. అందుకు విరుద్ధంగా సతీష్ వేమూరి (Sateesh Vemuri) సారధ్యంలోని టీం వేమూరి ప్యానెల్ ఎలక్ట్రానిక్ వోటింగ్ ద్వారా సైలెంట్ వోటింగ్ తో అద్భుతాలు జరుగుతాయని ఆశించి భంగపడింది.

20 వేలు కంటే ఎక్కువ ఓట్లు పాలైతే టీం కొడాలి (Team Kodali) ఫుల్ స్వీప్ చేస్తుందని NRI2NRI.COM ముందే చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. అందరి అంచనాలకంటే ఎక్కువగా దాదాపు 23 వేల పైచిలుకు ఓట్లు పోలవ్వడం, NRI2NRI.COM చెప్పినట్టే టీం కొడాలి ప్యానెల్ పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించడం విశేషం. ఫలితాలపై పూర్తి విశ్లేషణ త్వరలో మరో ఆర్టికల్ లో

విజేతల వివరాలు

Executive Committee:-

Executive Vice President: Naren Kodali
Secretary: Raja Kasukurthi
Treasurer: Bharath Maddineni
Joint Secretary: Venkat Koganti
Joint Treasurer: Sunil Pantra
Community Service Coordinator: Lokesh Naidu Konidala
Cultural Service Coordinator: Uma Katiki
Women Services Coordinator: Sohini Ayinala
Councilor at Large: Sateesh Kommana
International Coordinator: Tagore Mallineni
Sports Coordinator: Naga Panchumarthi

RR Southeast: Madhukar Yarlagadda
RR Appalachian: Rajesh Yarlagadda
RR New England: Krishna Prasad Sompally
RR North: Neelima Manne
RR North Central: Sriman Yarlagadda
RR Southern California: Hema Kumar Gotti
RR Northern California: Venkat Adusumalli
RR Northwest: Suresh Patibandla
RR Capitol: Sateesh Chinta
RR Mid Atlantic: Venkat Singu
RR Southwest: Sumanth Pusuluri
RR DFW: Paramesh Devineni
RR New Jersey: Ramakrishna Vasireddy
RR New York: Deepika Sammeta
RR Ohio Valley: Siva Chava
RR Midwest: Sriharsha Garikapati (Unanimous)
RR South Central: Emesh Chandra Gutta (Unanimous)
RR Rocky Mountains: Sekhar Kolla (Unanimous)

Board of Directors:-

Srinivas Lavu
Ravi Potluri
Mallikarjuna Vemana

Board of Director – Donor:-

Hema Kanuru (Unanimous)

Foundation Trustees:-

Ramakrishna Chowdary Allu
Bhakta Balla
Srinivas Kukatla
Raja Surapaneni
Srinivas Yenduri

Foundation Trustees – Donor:-

Suresh Puttagunta
Sridhar Gottipati

ఓట్ల వివరాలు

Executive Vice President
Naren Kodali – 13225 ✌️
Sateesh Vemuri – 10362

Board of Directors
Lavu Srinivas – 12695 ✌️
Ravi Potluri- 13044 ✌️
Surisha Tunuguntla – 11237
Malli Vemana – 11774 ✌️
Srinivas Vuyyuru – 10520
Venkata Ramana Yarlagadda – 10131

Secretary
Raja Kasukurthi – 12456✌️
Ashok Kolla – 11083

Treasurer
Bharath Maddineni – 12827✌️
Murali Talluri – 10617

Joint Secretary
Venkat Koganti – 13015✌️
Vamsi Vasireddy – 10501

Joint Treasurer
Sunil Pantra – 13013✌️
Shashank Yarlagadda – 10463

Community Service Coordinator
Rajini Akurati – 10177
Lokesh Konidala – 13362✌️

Cultural Service Coordinator
Rajinikanth Kakarla – 10854
Uma Katiki – 12638✌️

Women Services Coordinator
Sohini Ayanala – 12009✌️
Madhuri Yeluri – 11436

Councilor At Large
Pradeep Gaddam – 10590
Sateesh Kommana – 12827✌️

International Coordinator
Sridhar Kommalapati – 10168
Tagore Mallineni – 13300✌️

Sports Coordinator
Sriram Alokam – 10213
Naga Panchumurthi -13261✌️

Foundation Trustees
Ramakrishna Chowdary Allu – 12515✌️
Bhakta Balla – 13552✌️
Srinivas Kukatla – 12286✌️
Satyanarayana Manne – 11196
Ravikiran Muvva – 10490
Nagaraju Nalajula – 9883
Sumanth Ramsetti – 9643
Ravi Samineni – 10148
Raja Surapaneni – 13170✌️
Srinivas Yenduri – 12261✌️

Foundation Trustees – Donor
Chandu Gorrepati – 128
Sridhar Gottipati – 176✌️
Vikram Indukuri – 99
Suresh Puttagunta – 197✌️

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected