Connect with us

Community Service

ఆంధ్ర నుంచి అమెరికాకు వయా సింగపూర్: Rajesh Yarlagadda

Published

on

ఎక్కడో ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా, దాలిపర్రు గ్రామం పుట్టినూరు. సీను కట్ చేస్తే నార్త్ కరోలినా రాష్ట్రం, ర్యాలీ ఉద్యోగాన్వేషణలో చేరిన నగరం. మధ్యలో సింగపూర్ లో బ్రేక్. క్లుప్తంగా చెప్పాలంటే ఇది రాజేష్ యార్లగడ్డ (Rajesh Yarlagadda) ప్రయాణం; ఆంధ్ర నుంచి అమెరికాకు వయా సింగపూర్.

అందరిలానే అమెరికాలో తన ఉద్యోగం తను చేసుకుంటుండగా, తనతోపాటు చుట్టూ ఉన్న నలుగురికి సాయం అందించాలనే ఆలోచన మొదలైంది. అనుకున్నదే తడవుగా ర్యాలీ లోని స్థానిక తెలుగు సంఘం (Triangle Area Telugu Association), వెంకటేశ్వర స్వామి గుడి మరియు ఆసియన్ ఫోకస్ ఆఫ్ నార్త్ కరోలినా వంటి లాభాపేక్షలేని సంస్థల్లో వాలంటీర్ సేవలందించడం మొదలుపెట్టారు.

తన సేవలకు ప్రతిఫలంగా అనతి కాలంలోనే ట్రయాంగిల్ ఏరియా తెలుగు అసోసియేషన్ (Triangle Area Telugu Association) అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. తన హయాంలో సభ్యత్వ నమోదు, నూతన కార్యక్రమాల నిర్వహణ, యువతకి ఉపకార వేతనాలు, ఇంటర్న్షిప్స్, ఆర్ధికంగా నిధుల సేకరణ వంటి విషయాల్లో రికార్డు స్థాయిలో ర్యాలీ ప్రాంతంలోని అన్ని సంఘాల కంటే ట్రయాంగిల్ ఏరియా తెలుగు అసోసియేషన్ ని ఉన్నత స్థానంలో ఉంచారు.

ఆసియన్ ఫోకస్ ఆఫ్ నార్త్ కరోలినా (Asian Focus of North Carolina) సంస్థలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా వివిధ ఆసియా ప్రాంత ప్రజలతో మమేకమయ్యారు. ప్రత్యేకంగా ఆసియా ఫెస్ట్ (Asia Fest) నిర్వహణ కమిటీ సభ్యునిగా 10 వేలకు పైగా ఆహ్వానితులతో విజయవంతం చేయడంలో కీలకంగా వ్యవహరించారు.

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) ‘తానా’ లో ప్రెసిడెన్షియల్ అవార్డ్స్ ఛైర్ గా, టీం స్క్వేర్ వాలంటీర్ గా, అపలాచియన్ ప్రాంత తానా క్యూరీ కమిటీ సభ్యునిగా సేవలందించారు. అలాగే అపలాచియన్ ప్రాంతం (Appalachian Region) లో తానా 5కె రన్, ధీమ్ తానా, ఫుడ్ డ్రైవ్స్, ఫండ్రైజింగ్ కార్యక్రమాల నిర్వహణలో కీలకంగా పనిచేశారు.

కోవిడ్ (COVID-19) సమయంలో మాస్కులు, శానిటైజర్స్, గ్లోవ్స్ వంటి PPE (Personal Protective Equipment) కిట్స్ సేకరించి తానా (TANA) ద్వారా తెలుగువారికి అందించారు. ఈ మహమ్మారి సమయంలో నిస్వార్ధంగా సేవలందించి అందరి మన్ననలు పొందారు. రాజేష్ యార్లగడ్డ (Rajesh Yarlagadda) గురించి మరిన్ని వివరాలకు www.Rajesh4TANA.com ని సందర్శించండి.

మానవ సేవే మాధవ సేవ అని బలంగా నమ్మే రాజేష్ యార్లగడ్డ (Rajesh Yarlagadda) మిగతావారిలా ఎన్నికలప్పుడు మాత్రమే కాకుండా మిగతా సమయాల్లో కూడా తెలుగు వారికి ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉంటారని ర్యాలీ వాసుల నమ్మకం. మృధు స్వభావి అయిన రాజేష్ ఎటువంటి విపత్తులు వచ్చినా, సమాయనుకూలంగా సేవలందించడంలో ముందు వరుసలో ఉంటారు.

టు సర్వ్ యు బెటర్ (To Serve You Better) అంటూ రాజేష్ యార్లగడ్డ వచ్చే తానా ఎన్నికల్లో అపలాచియన్ రీజినల్ రిప్రజంటేటివ్ గా పోటీ చేస్తున్నారు. అందరూ తనకి మరియు టీం కోడాలి (Team Kodali) సభ్యులకు ఓటు వేసి గెలిపించ వలసిందిగా కోరుతున్నారు. ఎప్పటి నుంచో అపలాచియన్ ప్రాంతంలో తెలుగువారికి తలలో నాలుకలా ఉన్న తనకు మద్దతు ఇవ్వవలసిందిగా కోరుతున్నారు.

తను ఎన్నికైతే యువతని తానా లో ఇన్వాల్వ్ చేసేలా, అపలాచియన్ ప్రాంతంలోని తెలుగువారికి ఎప్పటిలానే చేదోడు వాదోడుగా ఉంటానంటున్నారు. తానా కళాశాల మరియు పాఠశాల కార్యక్రమాలను మరింత చేరువ చేస్తూ, మన తెలుగు భాష, సంస్కృతీ సాంప్రదాయాలను, కళలను ముందు తరానికి చేరేలా కృషి చేస్తానన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected