Connect with us

Education

TTA Seva Days: విద్యారంగ అభివృద్ధికి డా. పైళ్ల మల్లారెడ్డి కృషి శ్లాఘనీయం

Published

on

TTA సేవా డేస్ లో భాగంగా యదాద్రి జిల్లా, వలిగొండ TTA ఫౌండర్ డా. పైళ్ల మల్లారెడ్డి (Dr. Pailla Malla Reddy) గారు స్వయంగా నిర్మించిన వెంకటేశ్వర ప్రభుత్వ కళాశాల లో అభివృద్ధి కార్యక్రమం మరియు విద్యార్థులతో TTA నాయకులు మాట మంతి నిర్వహించారు.

TTA ఫౌండర్ పైళ్ల మల్లా రెడ్డి గారు స్వయంగా స్వంత స్థలం లో స్వంత నిధులతో ఈ కళాశాల ను నిర్మించి ప్రభుత్వానికి అందించడం జరిగింది. కళాశాల కు కావలసిన అన్ని ఫర్నిచర్, కంప్యూటర్స్, డిజిటల్ క్లాస్ రూం లు ఏర్పాటు చేశారు. పైళ్ల మల్లారెడ్డి గారు నడిచే దేవుడని కలాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీకాంత్ అన్నారు.

తెలంగాణ (Telangana) రాష్ట్రం లోనే గుర్తింపు పొందిన కలాశాల గా మార్చింది పైళ్ల మల్లారెడ్డి గారు. TTA చొరవకు కృతజ్ఞతలు తెలిపారు. సాధన అనే ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థి ఈ కళాశాల ఇక్కడ నిర్మించడం వల్లే మహిళా విద్య సాధ్యమైందని తెలిపారు.

40 లక్షల కాలాశాల అభివృద్ధి పనులు ఈ సంవత్సరం ఇచ్చిన పైళ్ల మల్లారెడ్డి గారు తమకు దేవునితో సమానం అని తెలిపారు. కావ్య అనే ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థి మాట్లాడుతూ అడగగానే మా కాలేజ్ కి ఇంత సహాయం చేసిన పైళ్ల మల్లారెడ్డి గారి ఆశయాలు సాధిస్తామని తెలిపారు.

TTA (Telangana American Telugu Association) సేవా డేస్ కో ఆర్డినేటర్ సురేష్ రెడ్డి గారు మాట్లాడుతూ.. ఇలాంటి విద్య సంబంధ అభివృద్ధి కార్యక్రమలు చేయడం ఆత్మ సంతృప్తి ఉంటుందని అన్నారు. TTA కార్యవర్గ సభ్యులను అందరికీ పరిచయం చేశారు.

TTA ప్రెసిడెంట్ వంశీ రెడ్డి కంచరకుంట్ల గారు మాట్లాడుతూ.. పైళ్ల మల్లారెడ్డి గారు కళాశాల కే కాదు మా TTA కు కూడా దేవుడే అని అన్నారు. సుంకిషాల ముద్దుబిడ్డ ఎవరు అంటూ ప్రశ్నించిన వంశీ గారికి విద్యార్థుల నుండి స్పందనగా పైళ్ల మల్లారెడ్డి అని బిగ్గరగా చెప్పారు.

థాంక్స్ మల్లన్న (Dr. Pailla Malla Reddy) అంటూ పిల్లలు తమ చప్పట్ల తో హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులను ఒక్కొక్కరిని ఏమవుతారు అని అడిగి తెలుసు కున్నారు. బాగా చదివి తప్పకుండా ఒక మంచి స్థాయికి రావాలని ఆశించారు. థాంక్స్ మల్లన్న అంటూ విద్యార్థులు అనాలని ప్రోత్సహించారు.

TTA స్టాండింగ్ కమిటీ మెంబర్ వాణీ గారు మాట్లాడుతూ కాలేజ్ లో చదివి లిమిటేషన్స్ లేకుండా చదువు లో ముందుకు సాగాలని కోరారు. లైఫ్ ఎవ్వరికీ ఈజీ కాదని తెలిపిన ఆమె, ఎదిగిన అందరి ప్రయాణం తెలుసుకోవాలని కోరారు. మీకు కావల్సిన అన్ని విషయాల కు సాయం చేస్తాం అని తెలిపారు. మీ సక్సెస్ లో మల్లన్న సక్సెస్ ఉందని అన్నారు.

TTA జనరల్ సెక్రటరీ కవిత రెడ్డి గారు మాట్లాడుతూ తన జీవిత ప్రయాణం గురించి వివరించారు. అమ్మాయిలు అబ్బాయిలు అందరు బాగా చదివి పైకి రావాలని కోరారు. TTA (Telangana American Telugu Association) బృందం కళాశాల ప్రిన్సిపాల్ ను శాలువాతో సన్మానించి మేమొంటో తో సత్కరించారు.

ఈ సందర్భంగా వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Programs) నిర్వహించారు. అందులో భాగంగా ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు సిరివెన్నెల మరియు హరిత చేసిన నృత్య ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది.

TTA FOUNDER
TTA Founder – Dr. Pailla Malla Reddy

ADVISORY COUNCIL MEMBERS
TTA Advisory Committee Chair – Dr. Vijayapal Reddy
TTA Advisory Committee Co-Chair – Dr. Mohan Reddy Patalolla

EXECUTIVE COMMITTEE & SEVA DAYS TEAM
TTA President – Vamshi Reddy Kancharakuntla
TTA President-Elect – Naveen Reddy Mallipeddi
TTA General Secretary – Kavitha Reddy
Seva Days Coordinator – Suresh Reddy Venkannagari
Seva Days Coordinator – Durga Prasad Seloj
India Coordinator – Dr. Dwarakanatha Reddy

Seva Days Advisor/ Health & Wellness Advisor – Jyothi Reddy Dudipala
Foundation Services Chair – Santosh Gantaram
Community Services Chair – Narsimha Peruka
TTA Joint Secretary – Shiva Reddy Kolla
TTA Joint Treasurer – Manohar Bodke
TTA National Coordinator – Pradeep Mettu
Ethics Committee Director – Ganesh Madhav Veeramaneni

BOARD OF DIRECTORS
Sangeetha Reddy
Mayur Reddy Bandaru
Venkat Gaddam
Abhilash Reddy Mudireddy

CONVENTION REGIONAL ADVISORS
Manoj Chinthireddy
Anil Errabelli

STANDING COMMITTEE, REGIONAL VICE PRESIDENTS & MEMBERS
Vani Gaddam
Pradeep Boddu
Aahlaad Reddy
Srikanth Reddy Singireddy
Vinod Kumar Gardas

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected