Connect with us

Jobs

యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా TTA మెగా జాబ్ మేళా విజయవంతం @ Warangal, Telangana

Published

on

వరంగల్ (Warangal) యువత ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న TTA (Telangana American Telugu Association) జాబ్ మేళా ఈరోజు రానే వచ్చింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మరియు ఎమ్మెల్యే నాగరాజు పాల్గొని ప్రసంగించారు. మొత్తంగా 1000 నుంచి 1500 మందిని హైర్ చేసుకునేలా ప్రణాళిక పెట్టుకున్నారు.

స్థానిక ఐటీ హబ్ (IT-SEZ) లోని క్వాడ్రంట్ టెక్నాలజీస్ (Quadrant Technologies) లో ఏర్పాటు చేసిన ఈ మెగా జాబ్ మేళా లో 2021 నుండి 2024 వరకు గ్రాడ్యుయేట్ అయిన లేక అయ్యే వారు పాల్గొన్నారు. సుమారు 30 కంపెనీలు ఈ జాబ్ మేళా (Mega Job Mela) లో పాలుపంచుకున్నాయి.

TTA ప్రెసిడెంట్ వంశీ రెడ్డి కంచరకుంట్ల (Vamshi Reddy Kancharakuntla) మాట్లాడుతూ ఈరోజు జాబ్ మేళా ఎలా జరుగుతుందో వివరించారు. ఇలాంటి అనేక కంపెనీల తో మళ్లీ మళ్లీ వరంగల్ లో జాబ్ మేళాలు నిర్వహిస్తామని తెలిపారు. మోహన్ రెడ్డి TTA నాయకులు మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన TTA సేవా డేస్ కార్యక్రమాలను, అలాగే యువతకు జాబ్ లు ఏల సాధించాలనే అంశం పై వివరించారు.

నవీన్ రెడ్డి మలిపెద్ది (Naveen Reddy Mallipeddi) TTA ప్రెసిడెంట్ ఎలెక్ట్ మాట్లాడుతూ ద్వితీయ శ్రేణి నగరాలకు సాప్ట్ వేర్ ను తీసుకు రావడం వంశీ రెడ్డి ప్రతిభ అని కొనియాడారు. సంతోష్ రెడ్డి గారు TTA సేవా డేస్ కో ఆర్డినేటర్ మాట్లాడుతూ ఇలాంటి జాబ్ మేళా లాంటి కార్యక్రమాల మళ్ళీ మళ్ళీ చేపడతామని తెలిపారు.

TTA (Telangana American Telugu Association) జనరల్ సెక్రటరీ కవిత రెడ్డి (Kavitha Reddy) గారు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి, నాగరాజు గారికి శుభాకాంక్షలు తెలిపారు. జాబ్ మేళా కు వచ్చిన ప్రతి ఒక్కరికీ జాబ్ రావాలని ఆశాభావం వ్యక్తంచేశారు.

జ్యోతి రెడ్డి TTA మహిళా నాయకురాలు హెల్త్ అండ్ వెల్ నేస్ అడ్వైసర్ గారు మాట్లాడుతూ ఒక్క ఫోన్ కాల్ తో కార్యక్రమం కు విచ్చేసిన ఎమ్మెల్యే లకు కృతజ్ఞతలు తెలిపారు.సేవా డేస్ కార్యక్రమాలను వివరించారు. మురళీదర్ రెడ్డి క్వాడ్రంట్ టెక్నాలజీస్ సంస్థ MD మాట్లాడుతూ ఇప్పుడు జాబ్ లు రాని వాళ్లకు వచ్చే రోజుల్లో అవకాశాలు ఇస్తామని తెలిపారు.

ఎమ్మెల్యే నాగరాజు (MLA Nagaraju) గారు మాట్లాడుతూ చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చే సంస్థ TTA అని అన్నారు. స్పోర్ట్స్మన్ గా స్టార్ట్ అయిన నా జీవితం SI గా అంచలంచెలుగా ఎస్పీ గా రిటైర్ అయ్యానని ఇప్పుడు మి ముందుకు ఎమ్మెల్యే గా వచ్చానని తెలిపారు. పే బ్యాక్ టు సొసైటీ అనే సూత్రం తో వచ్చిన TTA అద్భుతమైన సంస్థ అని తెలిపారు.

వంశీ రెడ్డి తల్లి తండ్రీ తో పాటు ఆయన భార్య కృషిని ప్రశంసించారు. యువత వల్లే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినదని తెలిపారు. జాబ్ మేళా (TTA Job Mela) కు వచ్చిన యువత కు అభినందనలు తెలిపారు. వంశీ రెడ్డి యువతకు రోల్ మోడల్ అని రియల్ హీరో వంశీ రెడ్డి అని అన్నారు.

ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి (Naini Rajender Reddy) గారు మాట్లాడుతూ చాలా సంతోషం వేస్తుందని అన్నారు. వంశీ రెడ్డి తల్లి తండ్రికి నమస్కారం తెలిపారు. వరంగల్ జాబ్ హబ్ మార్చాలని దానికి TTA ను కోరారు. ఎమ్మెల్యే లు వంశీ రెడ్డి అమ్మ నాన్నలకు శాలువాతో సన్మానించినారు. TTA సభ్యులు ఎమ్మెల్యే నాయని కి మరియు నాగరాజు గారికి శాలువాతో సన్మానించి, మేమొంటో సత్కరించారు.

సేవాడేస్ (TTA Seva Days) కార్యక్రమానికి కోఆర్డినేటర్ గా సురేష్ రెడ్డి వెంకన్నగారి గారు, India కోఆర్డినేటర్ గా డా. డి ద్వారకనాథ రెడ్డి గారు, కో – కోర్డినేటర్ గా దుర్గా ప్రసాద్ సెలోజ్ గారు, ఫౌండేషన్ సర్వీస్ చైర్ గా సంతోష్ గంటారం గారు, ఇంటెర్నేషనల్ వైస్ ప్రసిడెంట్ గా ప్రసాద్ కునారపు గారు, హెల్త్ అండ్ వెల్నెస్ అడ్వైసర్ గా జ్యోతిరెడ్డి దూదిపాల గారు, నర్సింహా పెరుక గారు – కమ్యూనిటీ సర్వీసెస్ చైర్ గా, ప్రసిడెంట్ గా వంశిరెడ్డి కంచరకుంట్ల గారు మరియు ప్రసిడెంట్ ఎలెక్ట్ గా నవీన్ రెడ్డి మలిపెద్ది గారు, కార్యదర్శిగా కవితారెడ్డి గారు భాద్యతలు నిర్వహిస్తున్నారు.

సేవా డేస్ లో పాల్గొన్న TTA సభ్యులు

Pradeep Boddu – TTA Chair
Shiva Reddy Kolla – Joint Secretary
Manohar Bodke – Joint Treasurer
Pradeep Mettu – National Coordinator
Ganesh Veeramaneni – Ethics Committee Director
Sangeetha Reddy – Board of Director
Venkat Gaddam – Board of Director

తెలుగు కళల తోట తెలంగాణ సేవల కోట అనే నినాదంతో 2015 లో తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ స్థాపించబడినది. తెలంగాణ తరుపున విదేశాలలో ఏర్పడిన మొట్టమొదటి సాంస్కృతిక సంస్థ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్. TTA Founder Pailla Malla Reddy Garu, Advisory Consul Chair – Vijayapal Reddy గారు, Co-Chair – Mohan Patalolla గారు, Member – Bharat Reddy Madadi గార్ల ఆధ్వర్యంలో 2015 లో మొదలై, ప్రస్తుత ప్రెసిడెంట్ వంశిరెడ్డి కంచరకుంట్ల గారి ఆధ్వర్యంలో ఇప్పటికే ఎన్నో సేవాకార్యక్రమాలతో దూసుకుపోతున్నది.

తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) తెలుగు రాష్ట్రాలలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే సేవా డేస్ కార్యక్రమాలను ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నామని, మిగతా రోజుల కార్యక్రమాలలో కూడా తెలంగాణ ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని TTA ప్రెసిడెంట్ వంశీ రెడ్డి కంచరకుంట్ల, ప్రసిడెంట్ ఎలెక్ట్ నవీన్ రెడ్డి మలిపెద్ది, సేవా డేస్ కార్యక్రమానికి కోఆర్డినేటర్ సురేష్ రెడ్డి వెంకన్నగారి కోరారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected