Connect with us

Elections

Appalachian Region: చార్లెట్‌లో నరేన్ కొడాలి ప్యానెల్ సుడిగాలి ప్రచారం

Published

on

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ ఎన్నికలలో భాగంగా నరేన్‌ కొడాలి ప్యానెల్ నార్త్ కరోలినా (North Carolina) రాష్ట్రం, చార్లెట్‌ నగరంలో సుడిగాలి ప్రచారం నిర్వహించారు. ప్రస్తుత తానా ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నరేన్‌ కొడాలి మరియు తన బృందం ఈ ప్రచారంలో పాల్గొన్నారు.

చార్లెట్‌ స్థానిక తానా నాయకులు పురుషోత్తమ చౌదరి గుడే, నాగ పంచుమర్తి, ఠాగూర్‌ మల్లినేని ఈ ప్రచార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుత తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, ప్రసాద్‌ నల్లూరి, శ్రీనివాస్ లావు, ఉమ కటికి ఆరమండ్ల, శ్రీనివాస కూకట్ల, జాని నిమ్మలపూడి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మదర్స్‌ డే (Mother’s Day) ను పురస్కరించుకుని తానా మహిళల చేత కేక్‌ కట్‌ చేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మే 15 ఆదివారం రోజున నిర్వహించిన ఈ ప్రత్యక్ష ప్రచారంలో భాగంగా వారు నరేన్‌ కొడాలి (Naren Kodali) టీమ్‌ని గెలిపించాల్సిందిగా చార్లెట్‌ వాసులను కోరారు.

ఛార్లెట్‌ (Charlotte) కు చెందిన అభ్యర్థులను పరిచయం చేస్తున్నప్పుడు వారిని గెలిపిస్తే తానాకు వారు చేయనున్న వివిధ సేవలను తానా ప్రస్తుత అధ్యక్షులు అంజయ్య చౌదరిలావు (Anjaiah Chowdary Lavu) మరియు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌ అభ్యర్థి నరేన్‌ కొడాలి తెలియజేశారు.

ఈ సందర్భంగా టీం కొడాలి (#TeamKodali) ప్యానల్ సభ్యులందరూ ప్రసంగించారు. టీమ్ కొడాలి ప్యానెల్ లో ఉన్న ప్రతి ఒక్క అభ్యర్ధికి ఓటు వేసి గెలిపించాల్సిందిగా అందరూ కోరారు. చివరిగా కార్యక్రమానికి హాజరైన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected