Connect with us

Elections

Raleigh: వర్కింగ్ డే లో 400 మందితో సత్తా చాటిన Team Kodali

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) ఎన్నికలలో (Elections) టీం కొడాలి వేగం పెంచింది. గత 15 రోజులుగా అమెరికాలోని ముఖ్య నగరాలను ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (Executive Vice President) అభ్యర్థి నరేన్ కొడాలి మరియు తానా మాజీ అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు విడివిడిగా చుట్టి వస్తున్నారు.

టీం కొడాలి విజయం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నరేన్ కొడాలి (Naren Kodali) మరియు అంజయ్య చౌదరి లావు (Anjaiah Chowdary Lavu) మొన్న బుధవారం డిసెంబర్ 13న అపలాచియన్ రీజియన్, నార్త్ కరోలినా రాష్ట్రంలోని ర్యాలీ నగరంలో సంయుక్తంగా ఎలక్షన్ కాంపెయిన్ నిర్వహించారు. బయట రాష్ట్రాలు/నగరాల నుంచి టీం కొడాలి పోటీదారులు సైతం హాజరయ్యారు.

స్థానిక TATA of NC (Triangle Area Telugu Association of North Carolina) అధ్యక్షునిగా పలు సేవలందించి ఇప్పుడు అపలాచియన్ ప్రాంత రీజినల్ రిప్రజంటేటివ్ పదవికి పోటీ చేస్తున్న రాజేష్ యార్లగడ్డ మరియు మాటలు తక్కువ చేతలు ఎక్కువ అని పేరు గడించి ఫౌండేషన్ ట్రస్టీ గా పోటీ చేస్తున్న రామక్రిష్ణ చౌదరి అల్లు ఈ కాంపెయిన్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించి ర్యాలీ (Raleigh) నగరంలో తమ సత్తా చాటారు.

వర్కింగ్ డే అయినప్పటికీ దాదాపు 400 మంది హాజరయ్యారంటే టీం కొడాలి (Team Kodali) కి మద్దతు బాగానే సమీకరించినట్లైంది. కమ్యూనిటి సేవలో ఎప్పటి నుంచో పాతుకుపోయిన అభర్ధులను బరిలోకి దింపడం, అందునా 6 గురు అభ్యర్థులు అపలాచియన్ రీజియన్ (Appalachian Region) నుంచి పోటీలో ఉండడం కలిసి వచ్చినట్లుంది.

మహిళలు (Women) పెద్ద ఎత్తున పాల్గొనడం, తమ అభిప్రాయాలను సైతం బహిరంగంగా పంచుకోవడం, కార్యక్రమం ఆసాంతం అందరూ ఉండడం చూస్తే, మొత్తంగా ఈ ర్యాలీ కాంపెయిన్ ఈవెంట్ అపలాచియన్ ప్రాంతలోనే కాకుండా ఓవర్ ఆల్ గా కూడా టీం కొడాలి (Team Kodali) లో మంచి జోష్ నింపిందనుకోవాలి.

ఇతర స్థానిక తెలుగు సంఘాల (Telugu Associations) నేతలు, పెద్దలు, వాలంటీర్స్ సైతం పాల్గొని మద్దతు తెలపడం విశేషం. ఈ కార్యక్రమంలో టీం కొడాలి (Team Kodali) పోటీదారులు రాజా కసుకుర్తి, మల్లి వేమన, ఠాగూర్ మల్లినేని, నాగ పంచుమర్తి, శ్రీనివాస్ కూకట్ల, విక్రమ్ ఇందుకూరి, చందు గొర్రెపాటి తోపాటు కిరణ్ కొత్తపల్లి పాల్గొన్నారు.

ఈ తానా ఎలక్షన్ కాంపెయిన్ (TANA Election Campaign) కార్యక్రమ నిర్వహణలో ప్రవీణ్ తాతినేని, మూర్తి అక్కిన, కుమార్ చల్లగుళ్ళ, సునీల్ కొల్లూరు, మధు సుంకు, కేదార్ బడిశెట్టి, రమేష్ తుమ్మలపల్లి, శ్రీపాద కాసు, వినోద్ కాట్రగుంట, వంశి బొట్టు, కేశవ్ వేముల, మిథున్ సుంకర, వెంకట్ కోగంటి, సిద్ద కోనంకి, బాల గర్జల, శశి చదలవాడ, ప్రకాష్ బయన, కార్తీక్ వల్లభనేని మరియు రవి దర్శి సహాయసహకారాలు అందించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected