Connect with us

Jana Sena

TDP 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు & ఇఫ్తార్ విందు: NRI TDP & Janasena, Kuwait

Published

on

ఎన్నారై తెలుగుదేశం కువైట్ (NRI TDP Kuwait) మరియు జనసేన (Janasena) కువైట్ ఆధ్వర్యములో తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకలు నిర్వహించారు. అలాగే పవిత్ర రంజాన్ (Ramadan) మాసం పురస్కరించుకుని కువైట్లో నివసిస్తున్న తెలుగు ముస్లిం (Muslim) సోదరులకు ఇఫ్తార్ విందు ఎర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ (TDP) గల్ఫ్ ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్ కుదరవల్లి సుధాకర రావు అధ్యక్షతన ఎన్నారై తెలుగుదేశం పార్టీ కువైట్ అధ్య్యక్షులు మద్దిన ఈశ్వర్ నాయుడు ఘనంగా నిర్వహించారు.

కుదరవల్లి సుధాకర రావు (Kudaravalli Sudhakara Rao) మాట్లడుతూ.. అన్న నందమూరి తారక రామారావు (NTR) గారు 1982 లో సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పేదల కోసం పెట్టిన పార్టీ అని అలాంటి పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ముస్లిం సోదరుల పవిత్ర రంజాన్ మాసం శుక్రవారం రోజున, క్రైస్తవ సోదరుల ప్రముఖ పండుగ గుడ్ ఫైడే రోజున చేసుకోవటం చాలా సంతోషం అని అన్నారు.

మద్దిన ఈశ్వర్ నాయుడు (Maddina Eswar Naidu) మాట్లాడుతూ.. త్వరలో మే 13న ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర శాసనసభకు జరగనున్న ఎన్నికల్లో (Elections) వీలైనవారందరూ పాల్గొని ఎన్.డి.యే. కూటమిని గెలిపించాలని, ఎవరైనా కొందరు ఎన్నికలకు వెళ్ళలేకపోతే వారు వాళ్ళ కుటుంభసభ్యులను, స్నేహితులను, చుట్టాలను ప్రభావితంచేసి కూటమి అభ్యర్దులను గెలిపించటానికి తమవంతు కృషిచేయాలని విఘ్నప్తి చేశారు.

జనసేన (Janasena) గల్ఫ్ జాతీయ కన్వీనర్స్ రామచంద్ర నాయక్ మరియు కాంచన శ్రీకాంత్ బాబు మాట్లాడుతూ.. మే 13న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరగనున్న ఎన్నికల్లో ఎన్.డి.యే. కూటమిని గెలిపించి సైకో పాలనకు చరమగీతం పాడాలని, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఒక దుర్మార్గుడి కబంద హస్తాల్లో ఇర్రుకుపోయిందని, దొంగ మద్యం, ఇసుక మాఫియా, గంజాయి రవాణా వంటి అస్సాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మరిందని, వీటినుండి కాపాడాలంటే ఎన్.డి.యే. కూటమిని గెలిపించాలని కోరారు.

తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) సీనియర్ నాయకులు ములకల సుబ్బారాయుడు మాట్లాడుతూ.. అభివృద్ది కావాలన్నా, రాష్ట్రరాజధాని కావాలన్నా, పరిశ్రమలు, ఐటి కంపెనీలు రావాలన్నా ఎన్.డి.యే. కూటమిని గెలిపించాలని విఘ్నప్తి చేశారు. ఎన్నారై తెలుగుదేశం పార్టీ కువైట్ (NRI TDP Kuwait) ఉపాధ్యక్షులు షేక బాషా విచ్చేసిన అందరికీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ తమ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన అందరికి దన్యవాదములు తెలియచేశారు.

ఈ కార్యక్రమానికి ఎన్నారై తెలుగు డేశం పార్టీ (TDP) సీనియర్ నాయకులు ములకల సుబ్బారాయుడు, గల్ఫ్ కౌన్సిల్ సభ్యులు వెంకట్ కోడూరి, ఎన్నారై తెలుగుదేశం పార్టీ కువైట్ ఉపాధ్యక్షులు షేక్ బాషా, కోశాధికారి ఎనుగొండ నరసిమ్హ, సోషల్ మీడియా ఇంచార్జి విసిసుబ్బారెడ్డి, గవర్నరేట్ కోఆర్డినేటర్స్ ఈడుపుగంటి దుర్గా ప్రసాద్, పెంచల్ రెడ్డి, కుటుంబరావు, ముష్తాక్ ఖాన్, మరియు ముఖ్యనాయకులు పోలారపు బాబు నాయుడు, ములకల రవి, పద్మరాజు వేణు, శివ మద్దిపట్ల, నరేష్ సన్నపనేని, పెంచల్ సన్నపనేని విచ్చేసారు.

అలాగే జనసేన (Janasena) నాయకులు గల్ఫ్ జాతీయ కన్వీనర్ కాంచన శ్రీకాంత్ బాబు, రామచంద్ర నాయక్, కువైట్ కన్వీనర్ ఆకుల రాజేష్, ఇమ్మిడిశెట్టి సూర్యనారయణ, వేణు, ఓబులేష్, చంద్రశేఖర్, తదితర జనసేన నాయకులు, జనసైనికులు మొదలగు వారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చివరిగా కేక్ కట్ చేసి ఇఫ్తార్ విందుతో కార్యక్రమాన్ని ముగించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected