Connect with us

Cultural

15 అడుగుల బతుకమ్మతో అంగరంగ వైభవంగా గేట్స్ బతుకమ్మ సంబరాలు @ Atlanta, Georgia

Published

on

. ఒక కళాకారుడు సంస్థ అధ్యక్షులైతే కార్యక్రమాలు ఉన్నతంగా చేయవచ్చని నిరూపించిన జనార్దన్ పన్నెల
. 3000 మందికి పైగా పాల్గొన్న గేట్స్ బతుకమ్మ సంబరాలు
. ఆకట్టుకున్న 15 అడుగుల బతుకమ్మ, డెకొరేషన్
. ఫుట్బాల్ ప్రాంగణంలో పల్లె వాతావరణాన్ని మరిపించిన వైనం
. చిన్నప్పటి నవరాత్రుల జ్ఞాపకాలను గుర్తుచేసిన పల్లకి సేవ
. బతుకమ్మ పండుగని గుర్తిస్తూ జార్జియా గవర్నర్ ప్రొక్లమేషన్
. శాస్త్రోక్తంగా దసరా, జమ్మిపూజ, షమీ పూజ, అలైబలై
. మన్ననలు పొందిన బతుకమ్మను తయారుచేసిన ఏడుకొండలు బృందం
. ఇతర అన్ని సంఘాల నాయకుల హాజరు

గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ఆధ్వర్యంలో బతుకమ్మ దసరా సంబరాలు అక్టోబర్ 22వ తేదీన ఫార్సీత్ సెంట్రల్ హై స్కూల్ లో ని ఫుట్బాల్ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. గేట్స్ కార్యవర్గసభ్యులు బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ గత రెండు నెలలుగా శ్రమించి అట్లాంటా ప్రజలందరికి ఆహ్లాదకరమైన పల్లె వాతావరణాన్ని కల్పించి అందరి మన్ననలు పొందారు.

ముఖ్యంగా పదిహేను ఫీట్ల బతుకమ్మ ను సుందరీకరించిన తీరు అందరిని ఆనందపరచింది. ఇంతవరకు ఉత్తర అమెరికాలో ఇంత పెద్ద బతుకమ్మను చేసిన దాఖలాలు లేవు. ఈ కార్యక్రమం గ్రేటర్ అట్లాంటా కార్యవర్గ సభ్యులు, బోర్డు అఫ్ డైరెక్టర్స్, సలహాదారులు, ముఖ్య అతిధులు, అట్లాంటాలోని వివిధ సంఘాల నాయకులు అందరు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసారు.

తరువాత బతుకమ్మ దసరసంబరాల సంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. ప్రధానంగా బాసర  సరస్వతి వందనం, బతుకమ్మ మహిళల గ్రూప్ ఆడిన కోలాటం, సక్కా సక్కని పులా సుక్క బతుకమ్మ పాటకు  మహిళా టీమ్ చేసిన ఫ్యాషన్ వాక్ అందరి ప్రశంసలు పొందింది. కార్యక్రమం చివర్లో చేసిన పల్లకి సేవ మన గ్రామంలో చిన్న నాడు నవరాత్రులలో పల్లకి ని ఊరంతా కలియతిప్పినటువంటి జ్ఞాపకాలను గుర్తుచేశాయి.

తర్వాతి కార్యక్రమాలలో భాగంగా రితీష్ దేశాయ్, రవి పొన్నంగి మరియు గేట్స్ కార్య నిర్వాహక సభ్యులు, సలహాదారులు, బోర్డు అఫ్ డైరెక్టర్స్ సమక్షంలో బతుకమ్మ పండగను జార్జియా గవర్నర్ గారు విడుదలచేసిన పత్రాన్ని అందరిసమక్షంలో కరతాళ ధ్వనుల మధ్య ఆ పత్రాన్ని విడుదల చేసారు. ఆ తరువాత ప్రతి ఏటా ఇచ్చే కిర్తిశేషులు గవ్వ సత్యనారాయణ రెడ్డి గారి మెమోరియల్ అవార్డును శ్రీ కరుణాకర్ రెడ్డి & ప్రశాంత్ ఆసిరెడ్డి గారికి వారు గేట్స్ కి చేసిన సేవలను అలాగే మన సంస్కృతిని ఇటు అమెరికాలో మరియు తెలుగు రాష్ట్రాలలో వారు చేసిన సేవలను గుర్తించి వారికి గేట్స్ కార్యనిర్వాహక సభ్యులు, బోర్డుసభ్యులు, అందరు కలిసి వారికి ఆవార్డు ను ప్రదానం చేసారు.

అలాగే ప్రతిఏటా గేట్స్ బోర్డులో నుండి ఒకరికి అందచేసే లేట్ గవ్వ సత్యనారాయణ రెడ్డి గారి ఆవార్డును గేట్స్ కి వారు చేసిన సేవలను గుర్తించి ప్రభాకర్ మదుపతి & రజిత గారికి అందచేశారు. గేట్స్ ఫుడ్ డ్రైవ్ కార్యక్రమాన్ని అంకిత భావముతో ముందుకు తీసుకెళ్తున్న రామక్రిష్ణ గండ్ర గారిని, సాంకేతిక పరంగా వెబ్సైట్  నిర్మాణంలో సేవలందించిన నవీన్ బత్తిని గారిని గేట్స్ కార్యనిర్వాహక సభ్యులు సన్మానించారు.

ఈ అవార్డుల తరువాత డప్పుచప్పుళ్ళతో బతుకమ్మలన్నింటిని ఒకదగ్గరికి చేర్చి మహిళలందరూ కూర్చొని  హిందూ టెంపుల్ అఫ్ అట్లాంటా అర్చకులు శ్రీ రవిశంకర్ గారి ఆధ్వర్యంలో జరిగిన గౌరీపూజను అందరు చక్కగా విని వారి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు, గౌరీ అనంతరం మహిళలందరూ మూడు వరుసలుగ చేరి మహిళా లందరు కలిసి బతుకమ్మ ను ఆడారు. అలాగే గాయని గాయకులు  స్ఫూర్తి జితేందర్ మరియు విద్యానంద చారి కలిసి పాడిన సంప్రదాయ బతుకమ్మ పాటలకు మహిళలందరూ ఎంతో ఆనందముతో బతుకమ్మ కోలాటం ఆడారు.

బతుకమ్మ ఆటతరువాత బతుకమ్మ ప్రైజ్ లను అందచేసారు. ఈ పోటీలలో అన్ని విభాగాలలో కలిపి సుమారు నాలువందలకు పైగా బతుకమ్మలు పోటీలో నిలవగా, గ్రూప్ ప్రైజ్లో మొదటి బహుమతి రైతు నేస్తం వారికి, రెండవ బహుమతి సింగిడి గ్రూపుకి, మూడవ బహుమతి కాకతీయ క్వీన్స్ కి అందచేశారు, అలాగే వ్యక్తిగత బతుకమ్మ మొదటి బహుమతిని సంధ్య ముక్క గారికి, రెండవ బహుమతి లక్ష్మి బుసా గారికి, మూడవ బహుమతి ప్రియాంక చెన్న మాధవుని గారికి అందచేయటం జరిగింది.

యువకుల బతుకమ్మ పోటీలో మొదటి బహుమతి ఆన్యా ఆరాధ్య కు, రెండవ బహుమతి సాహి ఇషిత కి, మూడవ బహుమతి లాస్యరావు కి అందచేయటం జరిగింది. ఈసారి మొట్ట మొదటిసారిగా ఆమెరికాలో అమ్మమ్మ/నానమ్మ మనుమరాలు బతుకమ్మ పోటీలను నిర్వహించారు మొదటి బహుమతిని మాధురి కొండపల్లి/స్వర గొల్లపూడి గారికి, రెండవ బహుమతిని సరస్వతి/అద్విక  తూర్పు కి, మూడవ బహుమతి ని ఊర్మిళ దేవి గంజి/అధ్య దేవి గంజికి బహుమతి ప్రదానం చేసారు.

బతుకమ్మ బహుమతుల పంపిణి తరువాత దసరా, జమ్మిపూజ, షమీ పూజ, అలైబలై కార్యక్రమం పల్లకి సేవ కార్యక్రమాలుఎంతో  ఉత్సాహంగా మహిళలు, యువకులు పెద్దవారు అందరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. ఈ  కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గణేష్ కాసం వారి మిత్రులకు కృతజ్ఞతలు తెలియచేసారు.

గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సంస్థకు ఆర్థికంగా సహాయాన్ని అందిస్తున్న దాతలకు గేట్స్ అధ్యక్షులు శ్రీ జనార్దన్ పన్నెల గారు గేట్స్ బోర్డు చైర్మన్ శ్రీనివాస్ పర్సా గారు ధన్యవాదములు తెలియ చేసారు. అలాగే ఈకార్యక్రమానికి హాజరైన వివిధ సంఘాల (TAMA, GATA, TDF, IFA, ATA, TANA, NATA, TTA AND GTA) ప్రముఖులందరికి కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 3000 కు పైగా ప్రజలు పాల్గొన్నారు.

ముఖ్యంగా గేట్స్ వారు చేసిన భోజన ఏర్పాట్లు అందరి మన్ననలను పొందింది, భోజనముతోపాటుగా మీటపాన్ ను  అందించిన తీరు మన కుటుంబంలో ఒక పండగకు వచ్చిన అనుభూతిని పొందారు. ఈకార్యక్రమానికి ప్రధానంగా రుచి కరమైన ఆహారాన్ని అందించిన బిర్యానీపాట్ రెస్టారెంట్, కాకతీయ రెస్టారెంట్, బాంబే లాంజ్ రెస్టారెంట్ ను గేట్స్ సభ్యులు కృతజ్ఞతలు తెలియచేసారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా విచ్చేసిన బాబ్ ఎర్రమిల్లి సిటి కౌన్సిల్ జాన్స్ క్రీక్ గారికి, దిలీప్ తున్కి సిటి కౌన్సిల్ జాన్స్ క్రీక్ గారికి, డాక్టర్ శ్రీని గంగసాని వైస్ చైర్ అఫ్  జార్జియా కంపోసిట్ మెడికల్ బోర్డు మరియు అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫీజిషన్స్ కోశాధికారి గారికి, స్టేసీ స్కిన్నర్ సిటి కౌన్సిల్ జాన్స్ క్రీక్ గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియచేసారు.

వ్యాఖ్యాతలు జ్యోత్స్న పాలకుర్తి, ఉదయ ఈటూరు, శ్రీ ఫొటోస్ సురేష్ ఓలం, బైట్గ్రాఫ్ ప్రశాంత్ కొల్లిపర, AR Dazzle Events రాజ్ తదితరులకు కృతఙ్ఞతలు తెలియజేశారు. ఎంతో సమయం వెచ్చించి బతుకమ్మలు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మహిళలను అభినందించారు. అలాగే అందరిని ఆకట్టుకున్న 15 అడుగుల బతుకమ్మను తయారుచేసిన ఏడుకొండలు బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

GATeS EC & BOD: Janardhan Pannela (President), Srinivas Parsa (Chairman), Sandeep Gundla (Vice-President), Naveen Battini (General Secretary), Ramana Gandra (Treasurer), Kirthidhar Goud Chekkilla (Cultural Secretary), Chalapathi Vennamaneni (Event Secretary), Raghuveer Gadipalli (Sports Secretary), Naveen Vujjini (Technology Secretary), Ganesh Kasam (Media Secretary), Prabhakar Madupathi (Director), Ramachary Nakkerty (Director), Ramakrishna Gandra (Director), Geetha Narannagari (Director), Jyothsna Palakurthy (Director) and thanks to all advisors, Dr. Sreeni Gangasani, Dr.Satish Cheti, Goutham Goli, Ratan Eluganti, Prabhakar Boyapalli, Karunakar Asireddy, Kiran Pasham, Venkat Veeraneni, Srijan Joginapally, Sreedhar Nelavelli,  Nanda Chatla, Narender Reddy, Sridhar Julapally, Anil Boddireddy, Thirmal Pitta and Chairs, CoChairs and all the volunteers relentlessly worked to make the event grand success.

అంకితభావంతో పనిచేసిన స్వచ్ఛంద సేవకులకు గేట్స్ కార్యనిర్వాహక సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు. Volunteers: Yedukondalu, Rajib Mukherjee, Madhukar Reddy Patel, Narsing Rao Vatnala, Arun Kavati, Anil Kushnapalli, Krishna Japa, Raveender Dasarapu, Anup Mereddy, Ashok Palla, Bala, Vinay Chenagarapu, Dinesh Dunthula, Giridhar Kotagiri, Anand Bukka, Kanakalaxmi Chintala, Harish Maripalli, Madhu Nambeti, Kamal Kishore, Madhukar Reddy Mudireddy, Mahesh Koppu, Neha Kushnapalli, Sai Sanjana Dasarapu, Sai Vandana Dasarapu, Ravi Kalli, Sohan Gandra, Vishwaktej Pannela, Vikhyathrana Pannela, Sanjeev Ekkaluri, Nagaraj Kotakonda, Prasanna Thirumala, Rajesh Balde, Ramakrishna Velpuri, Sathya Kancherla, Shailaja Kushnapalli, Roopa Pannela, Shivakiran Lingishetty, Shravan Gasikanti, Siva Talluri, Srinivas Gudimalla, Srinivasulu Ramisetty, Sadana Gandra, Mahalaxmi Votnala, Suma Kasam, Sushma Kondapalli, Sowmya Kondapalli, Vijaykumar Vinjamara, Chandrashekar Altheti, Prashant Veerabomma, Manojkumar Muthyam, Yadagiri, Sourab Kasam, Ramesh Thalluru, Tanvi Thalluru, Ganesh Myaka, Sathvik Koppu,  Ashwika Gandra, Prashant Erabelli, Anil Arshanapally, Pramod Enabothula, Madhava Rao Kusam.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected