Connect with us

News

AP CM జగన్ ని కలిసిన ఆటా నాయకులు, ATA కన్వెన్షన్ కి ఆహ్వానం

Published

on

అమెరికా తెలుగు సంఘం ‘ఆటా’ నాయకులు గత వారంపాటు రెండు తెలుగు రాష్ట్రాలలో (Telugu States) బిజీబిజీగా గడుపుతున్నారు. 18వ ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ కి మహామహులను ఆహ్వానిస్తూ, ఆటా (ATA) సేవాకార్యక్రమాలను వివరిస్తున్నారు. ఇప్పటికే పలువురు రాయకీయ, సినీ, ధ్యాన ప్రముఖులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ని ఆటా కన్వెన్షన్ కి ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ప్రచారంలో తలమునకలై ఉన్న వై ఎస్ జగన్ (Yeduguri Sandinti Jagan Mohan Reddy) ని నెల్లూరు లో ఆటా (American Telugu Association) అధ్యక్షులు మధు బొమ్మినేని, కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం, ఆటా మాజీ ప్రెసిడెంట్ కరుణాకర్ ఆసిరెడ్డి, కోఆర్డినేటర్ వశిష్టి రెడ్డి కలిశారు.

ముందుగా పుష్పగుచ్చం అందించి కుశల ప్రశ్నలు వేశారు. అనంతరం ఆటా 18వ మహాసభల ఆహ్వానాన్ని సాదరంగా అందజేసి తప్పకుండా రావలసిందిగా కోరారు ఆటా నాయకులు. జగన్ (YS Jagan Mohan Reddy) కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఆ సమయంలో రాజ్యసభ సభ్యులు, YSRCP లీడర్ విజయసాయి రెడ్డి (Venumbaka Vijayasai Reddy) తదితరులు అక్కడ ఉన్నారు.

2024 జూన్ 7 నుంచి 9 వరకు అమెరికాలోని జార్జియా రాష్ట్రం, అట్లాంటా (Atlanta) మహానగరంలో నిర్వహిస్తున్న 18వ ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ (18th ATA Convention & Youth Conference) వివరాలకు www.NRI2NRI.com/ATA 18th Convention ని సందర్శించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected