Connect with us

News

CM రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, కొండా సురేఖ కు TTA Mega Convention సాదర ఆహ్వానం

Published

on

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నాయకులు గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో బిజీబిజీగా గడుపుతున్నారు. సియాటిల్ (Seattle) మహానగరంలో జరగనున్న TTA మెగా కన్వెన్షన్ (Mega Convention) కి రాజకీయ, సినీ పెద్దలకు ఆహ్వాన పత్రాలు అందిస్తూ, TTA సేవాకార్యక్రమాలను వివరిస్తున్నారు.

ఇప్పటికే భారతీయ జనతా పార్టీ (BJP) నేత ఈటల రాజేందర్‌, టాలీవుడ్ హీరో నితిన్, కేంద్ర మంత్రి & బీజేపీ నేత కిషన్ రెడ్డి, తెలుగు సినీ నిర్మాత దిల్ రాజు, ప్రముఖ రాజకీయ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ వంటి వారిని ప్రత్యేకంగా కలిసి TTA మెగా కన్వెన్షన్ (Mega Convention) కి రావాల్సిందిగా కోరారు. ఆ వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇందులో భాగంగానే ఈరోజు మరికొంత మంది మహామహులను కలిశారు. ఆహ్వానం అందుకున్న ప్రముఖులలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎనుముల (Revanth Reddy Anumula), రోడ్లు, భవనాలు & సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దేవాదాయ & అటవీశాఖా మంత్రి కొండా సురేఖ మరియు పలువురు ఇతర ప్రముఖులు ఉన్నారు.

ఈ Telangana American Telugu Association (TTA) మెగా కన్వెన్షన్ ఆహ్వాన కార్యక్రమాలలో టీటీఏ ప్రెసిడెంట్ వంశీరెడ్డి కంచరకుంట్ల, ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది, బీవోడీ జ్యోతి రెడ్డి దూదిపాల, రీజినల్ అడ్వైజర్ డా. ద్వారకానాధ్ రెడ్డి, సీఈసీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ LN రెడ్డి దొంతిరెడ్డి, నవీన్‌ గోలి తదితర TTA నాయకులు పాల్గొన్నారు.

TTA లాంటి చక్కని ప్లాట్ ఫామ్ ని ఏర్పాటుచేసిన డా. పైళ్ల మల్లారెడ్డి (Dr. Pailla Malla Reddy), అడ్వైజరీ కౌన్సిల్ ఛైర్ డా. విజయపాల్ రెడ్డి, కోఛైర్ డా. మోహన్ రెడ్డి పటలోళ్ళ, సభ్యులు భరత్ రెడ్డి మాదాడి మార్గదర్శకత్వంలో అధ్యక్షులు వంశీ రెడ్డి కంచరకుంట్ల (Vamshi Reddy Kancharakuntla), కన్వీనర్ చంద్రసేన శ్రీరామోజు మరియు ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది సారధ్యంలో కన్వెన్షన్ ఏర్పాట్లు సాగుతున్నాయి. మరిన్ని వివరాలకు www.TTAConvention.org ని సందర్శించండి.

కన్వెన్షన్ అడ్వైజరీ కమిటీ
డా. పైళ్ల మల్లారెడ్డి
డా. విజయపాల్ రెడ్డి
డా. మోహన్ రెడ్డి పటలోళ్ళ
భరత్ రెడ్డి మాదాడి
వంశీ రెడ్డి కంచరకుంట్ల

కన్వెన్షన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ
వంశీ రెడ్డి కంచరకుంట్ల
చంద్రసేన శ్రీరామోజు
నవీన్ రెడ్డి మల్లిపెద్ది
గణేష్ మాధవ్ వీరమనేని
మాణిక్యం తుక్కాపురం
మనోహర్ బాదుకే
డా. నరసింహా రెడ్డి దొంతిరెడ్డి
కవితా రెడ్డి
సహోదర్ రెడ్డి పెద్దిరెడ్డి
డా. దివాకర్ జంధ్యం
శివా రెడ్డి కొల్ల
ప్రదీప్ మెట్టు
ప్రసాద్ కునారపు
సురేష్ రెడ్డి వెంకన్నగారి
ఉషా రెడ్డి మన్నెం

కన్వెన్షన్ రీజినల్ అడ్వైజర్స్
నవీన్ గోలి
మనోజ్ చింతిరెడ్డి
అనీల్ ఎర్రబెల్లి
డా. ద్వారకానాథ్ రెడ్డి

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected