Connect with us

Language

తెలుగు మాట్లాట పోటీలలో పటిమను ప్రదర్శించిన Atlanta చిన్నారులు

Published

on

Atlanta, Georgia: సిలికానాంధ్ర మనబడి (Silicon Andhra Manabadi), ఆట్లాంటా శాఖ వారు  DeSana Middle School లో ఏప్రిల్ 14, 2024 న గాయత్రి గాడేపల్లి గారి ఆధ్వర్యంలో తెలుగు మాట్లాట పొటీలు  నిర్వహించారు. తెలుగు మాట్లాట అనేది సిలికాన్ఆంధ్ర మనబడి కార్యక్రమం.

ఇది తెలుగు భాషా ట్విస్ట్‌తో ఉత్తేజకరమైన, ఆహ్లాదకరమైన, జనాదరణ పొందిన ఆటల ద్వారా వారి స్నేహపూర్వక పోటీ స్ఫూర్తిని రేకెత్తించడం ద్వారా డయాస్పోరా పిల్లలలో తెలుగు భాష (Telugu Language) పై ఆసక్తి మరియు ప్రేమను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

100 మంది కి పైగా విద్యార్థులు (5-14) సంవత్సరముల లోపు వారు ఓ.ని.మా, పదరంగం మరియు తిరకాటం పొటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. బుడతలు చాలా బాగా ఆడగా, సిసింద్రీలు సై అన్నారు. నగెష్ గారు, సుచేత గారు, గాయత్రి గారు మరియు అధ్యాపకులు విజయం సాధించిన విద్యార్థులకు బహుమానాలను, సర్టిఫికెట్స్ (Certificates) ను ప్రధానం చేశారు.

అలాగే పిల్లలకు, తల్లితంద్రులకు అభినందనలు తెలిపారు. ఓ.ని.మా, పదరంగం, తిరకాటం లో మొదటి మరియు రెండవ స్థానం సాదించిన విద్యార్థులు డెట్రాయిట్ (Detroit, Michigan) లో ఆగస్ట్ 31 -సెప్టెంబర్ 1 2024 న జరిగే ఇంటర్నేషనల్ (International) తెలుగు మాట్లాట పొటీలకు అర్హులయ్యారు.

తెలుగు మాట్లాట (అట్లాంటా, జార్జియా) 2024 విజేతల వివరాలు

బుడతలు (Budathalu)

తిరకాటం

మొదటి స్థానం (Winner) – Megha Kanaparthi

రెండవ స్థానం (Runner up) – Shreyash Gampa

పదరంగం

మొదటి స్థానం (Winner) – Kris Chama

రెండవ స్థానం (Runner up) – Sharan Meda

ఒ.ని.మ

మొదటి స్థానం (Winner) – Shreyas Gampa

రెండవ స్థానం(Runner up) – AmrutaVayugundla

సిసింద్రీలు (Sisindreelu)

తిరకాటం

మొదటి స్థానం (Winner)- Samhita Koppula

రెండవ స్థానం (Runner)- Saisatvik Koppula

పదరంగం

మొదటి స్థానం (Winner )-Ashrith Gundra

రెండవ స్థానం (Runner )-Satya Eesaana Charit Kasibhatla

ఒ.ని.మ

మొదటి స్థానం (Winner) – Mohnish Maddineni

రెండవ స్థానం (Runner up) – SaiSathvik, Koppula, Pranava Siddharth Reddy Kona, Karthik Malladi

ఈ తెలుగు మాట్లాట కార్యక్రమం సమర్థవంతం కావడానికి విజయ్ రావిళ్ల (Vijay Ravilla) గారు, సబ్ రీజినల్ కో-ఆర్డినేటర్స్ – సుచేత గారు, నగేష్ గారు, మారియట్టా, కమ్మింగ్, డన్వుడీ, ఆల్ఫారెట్టా, రివర్ డేల్ సెంటర్ కో-ఆర్డినేటర్లు – భారతి గారు, గౌరీధర్ గారు, మృదుల గారు, యశ్వంత్ గారు, శిరీష గారు, అధ్యపకులు – కిరణ్ గారు, మెహర్ గారు, సుక్రత్ గారు, శివ గారు, శ్రీదివ్య గారు, సుధా గారు, సుధారాణి గారు, సువర్ణ గారు, సువర్ణ రేఖ గారు, నీరజ గారు, వాలంటీర్లు  మరియు తల్లి తండ్రులు తమ వంతు సహాయ సహకారాలు అందచేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected