Connect with us

News

ఘనంగా Telugu Alliances of Canada ఉగాది ఉత్సవాలు @ Toronto

Published

on

తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (Telugu Alliances of Canada – TACA) ఆధ్వైర్యంలో ఏప్రిల్ 13, 2024 శనివారం రోజున కెనడా దేశంలోని టోరొంటో (Toronto) పెవిలియన్ ఆడిటోరియంలో దాదాపు పదిహేనువందల మంది ప్రవాస తెలుగు వాసులు సకుటుంబ సపరివార సమేతంగా పాల్గొని ఉగాది పండుగ (Ugadi Festival) ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.

తాకా అధ్యక్షులు శ్రీ రమేశ్ మునుకుంట్ల (Ramesh Munukuntla) గారు ప్రారంబించగా, జనరల్ సెక్రెటరి శ్రీ ప్రసన్న కుమార్ తిరుచిరాపల్లి సభికులను ఆహ్వానించగా, శ్రీమతి ధనలక్ష్మి మునుకుంట్ల, శ్రీమతి సాధన పన్నీరు, శ్రీమతి వాణి జయంతి, శ్రీమతి అనిత సజ్జ మరియు శ్రీమతి సుకృతి బాసని గారల జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

కెనడా జాతీయ గీతం ఆలాపనతో సాయంత్రము ఐదు గంటలకు ప్రారంబమైన సాంస్కృతిక కార్యమ్రమాలు దాదాపు ఆరు గంటల పాటు నిరాఘాటంగా 150 కి పైన స్థానిక తెలుగు కుటుంబాల కళాకారులతో (Telugu Artists) కొనసాగాయి. ఉగాది పండుగ సందర్భంగా క్రోధి నామ సంవత్సర పంచాంగ శ్రవణం ప్రముఖ పురోహితులు శ్రీ మంజునాథ్ గారు సభికులందరికీ రాశి ఫలాలు తెలియచేశారు.

2024 సంవత్సరపు తాకా ఉగాది పురస్కారాలను (Ugadi Awards) ప్రముఖ డా||జగన్ మోహన్ రెడ్డి గరిస, ఒంటారియో రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శ్రీమతి దీపిక దామెర్ల మరియు కెనడా (Canada) లో తెలుగు (Telugu) ప్రముఖులు శ్రీ లక్ష్మీనారాయణ సూరపనేని (Lakshminarayana Surapaneni) గారలకు అందచేసి ఘనంగా సత్కరించారు.

ఈ ఉత్సవాలలో ప్రముఖ తెలంగాణా (Telangana) చిత్రకారులు డా||కొండపల్లి శేషగిరిరావు గారి శతజయంతి ఉత్సవాలలో బాగంగా “An Odyssey of Life and Art Dr Kondapalli Seshagiri Rao” పుస్తకాన్ని వారి బందు మిత్రులు శ్రీ విజయరామారావు గారు మరియు శ్రీ సుబ్బారావు గారి సమక్షంలో ఫౌండేషన్ కమీటీ చైర్మన్ శ్రీ అరుణ్ కుమార్ లాయం గారు మరియు అధ్యక్షులు శ్రీ రమేశ్ మునుకుంట్ల గారు ఆవిష్కరించి డా|| కొండపల్లి శేషగిరిరావు గారి జీవితం నేటి యువకులకు, విద్యార్థులకు ఆదర్శప్రాయమని తెలియచేశారు.

తాకా (Telugu Alliances of Canada) వ్యవహారిక కార్యక్రమములో అధ్యక్షులు శ్రీరమేశ్ మునుకుంట్ల గారు మాట్లాడుతూ.. తెలుగు కళలు, పండుగలు, భారతీయ సంసృతి సాంప్రదాయాలను కెనడా (Canada) లోని తెలుగు వారందరూ కొనసాగిస్తూ ముందు తరాలకు అందజేయుటకు తాకా చేస్తున్న కృషిలో కెనడాలోని ప్రవాస తెలుగు వారందరూ పాల్గొన వలసినదిగా కోరారు.

ఈ సందర్భంగా ఒంటారియో (Ontario) రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శ్రీమతి దీపిక దామెర్ల, డా||జగన్ మోహన్ రెడ్డి గరిస, శ్రీ లక్ష్మీనారాయణ సూరపనేని, ముఖ్య ఫౌండరు శ్రీ హనుమంతాచారి సామంతపుడి, జనరల్ సెక్రెటరి శ్రీ ప్రసన్నకుమార్ తిరుచిరాపల్లి, ఫౌండేషన్ కమీటీ చైర్మన్ శ్రీ అరుణ్ కుమార్ లాయం సభికులనుద్దేసించి ప్రసంగించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected