Connect with us

Financial Assistance

F1 వీసాపై చదువుకుంటున్న తెలుగు విద్యార్థులకు తానా ఉపకారవేతనాలు

Published

on

రెండు తెలుగు రాష్ట్రాల నుంచి F1 వీసా మీద అమెరికా వచ్చి ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థులు ప్రతి సంవత్సరం వేలల్లో ఉంటారు. యూనివర్సిటీ ఫీజులు కట్టడానికి వీరిలో ఎక్కువమంది భారతదేశంలో లోను తీసుకుని వచ్చేవాళ్లే ఎక్కువ. మరి అలాంటి విద్యార్థులకు ఉడతాభక్తిగా ఎంతో కొంత ఆర్ధిక సహాయం చేస్తే బాగుండు అని అందరికీ ఉంటుంది.

అదే విషయాన్ని 15 సంవత్సరాల క్రితమే గ్రహించిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ ఈ ఉపకారవేతనాల ప్రాజెక్ట్ ని చేపట్టింది. మాస్టర్స్ చదివే విద్యార్థుల నుంచి దరఖాస్థులు స్వీకరించి, అన్ని విధాలుగా పరిశీలించి, అర్హులైన కొంతమందిని ఎంపికచేసి ఉపకారవేతనాలు అందిస్తూ ప్రతి సంవత్సరం చేదోడు వాదోడుగా ఉంటూ చేయూతనిస్తూ వస్తుంది.

ఈ సంవత్సరంలో భాగంగా మార్చి 3న డాలస్ లో తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 18 మంది తెలుగు విద్యార్ధులకు ఉపకారవేతనాలు అందజేశారు. స్థానిక మైత్రీస్ రెస్టారెంట్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాలస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన కార్యక్రమాన్ని ప్రారంభించి స్వాగతోపన్యాసం చేసారు. అనంతరం ‘విద్య జీవితానికి వెలుగునిస్తుంది’ అనే నినాదంతో తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ, కార్యదర్శి శశికాంత్ వల్లేపల్లి, కోశాధికారి శ్రీకాంత్ పోలవరపు, మురళి వెన్నం, పూర్వాధ్యక్షులు ప్రసాద్ తోటకూర, లోకేష్ నాయుడు, తానా ఫౌండేషన్ బృందం సారధ్యంలో అర్హులైన విద్యార్ధులకు ఉపకారవేతనాలు అందించారు. ఈ ప్రాసెస్లో డా. ప్రసాద్ కాకర్ల MD, DCH, FAAP సహకారం అందించారు.

తానా ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకట రమణ మాట్లాడుతూ ఫౌండేషన్ ఈ సంవత్సరం ఇండియాలో ప్రస్తుత తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు సారధ్యంలో ఇంతకు ముందుకంటే మరిన్ని సేవా కార్యక్రమాలను చెపట్టడం జరిగింది అని అన్నారు. తానా ఫౌండేషన్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో మంది పేద ప్రజలకు ఉపయోగకరంగా వున్నాయని చాలామంది దాతలు డోనార్ కేటగిరిలో విరాళాలు ఇవ్వడానికి ముందుకువచ్చారని తెలియజేశారు. దాతల ఉదారత తానా ఫౌండేషన్ కార్యనిర్వహణ బృందానికి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడానికి స్పూర్తినిచ్చిందని, దాతలు అందరికి దన్యవాదాలు తెలియజేశారు. తానా ఫౌండేషన్ వారు ఇండియాలో నిర్వహిస్తున్న అన్నపూర్ణ, క్యాన్సర్, నేత్ర శిబిరాలు, డిజిటల్ శిక్షణ తరగతులు, స్కూల్ గ్రంధాలయాలు, గ్రామాలలో మంచి నీటి కార్యక్రమాలు, అనాధ శరణాలయాలకు ఆదరణ ఇలా మరెన్నో కార్యక్రమాలను పేదప్రజలకు అందించడం చాలా ఆనందంగా వుందన్నారు.

ఇది చూసి స్ఫూర్తి పొందిన వెంకట రమణ కొల్లా ముందుకు వచ్చి UNT లో చదువుకుంటున్న ఒక విద్యార్ధికి ఒక సెమిస్టర్ కు అయ్యే ఖర్చు మొత్తం విరాళంగా ఇచ్చారు. అనంతరం వెంకట రమణ యార్లగడ్డ, పూర్వాధ్యక్షులు ప్రసాద్ తోటకూర, MVL ప్రసాద్, సత్యన్ కళ్యాణ్ దుర్గ్, డా. పుదుర్ జగదీశ్వరన్, మురళి వెన్నం, లోకేష్ నాయుడు, సతీష్ కొమ్మన, ఉమామహెష్ పార్నపల్లి (టాంటెక్స్ అధ్యక్షులు), వెంకట్ ములుకుట్ల (టాంటెక్స్ – Chair BoT), లెనిన్ వేముల, ప్రమోద్ నూతేటి, చినసత్యం వీర్నపు విద్యార్ధులకు ఉపకారవేతనాలు అందజేశారు. స్కాలర్ షిప్ లను అందుకున్న విద్యార్ధులు తానా ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేశారు.

ఉపకారవేతనాల దాతలు – రవీంద్రనాధ్ గుత్తికొండ దంపతులు, గద్దే సీతారామమ్మ తిరుపతయ్య, గుత్తికొండ బాలమణి రామబ్రహ్మం, గుత్తికొండ బసవపున్నరావు ఉమాదేవి, కొడాలి వీరయ్య సరోజని, యుగంధర్ వల్లభనేని దంపతులు, తానా ఫౌండేషన్, ప్రసాద్ కాకర్ల దంపతులు, సాయి రమేష్ బిక్కిన దంపతులు, డా. మోటూరు భాను ప్రసాద్ మెమోరియల్, ప్రసాద్ దేవభక్తుని, డా. లోకెశ్వరావు స్కాలర్షిప్, జే తాళ్ళూరి స్కాలర్షిప్, పుట్టా వెంకటరావు స్కాలర్షిప్, జానకిరామ కొడుదు స్కాలర్షిప్, వెలమాటి ప్రసాద్.

ఉపకారవేతనాలు ఇవ్వడానికి సహకరించిన యూనివర్సిటీస్ – University of Dallas (UTD), Western Illinois University, New Jersy Institute of Technology, Pittsburg State University, University at Albany, MSU Texas, University of North Texas (UNT), North Carolina Tech State University, University of Texas AT Arlington, Mississippi State University, University of New Haven, Southern Arkansas University, Trine University, North Eastern University.

తానా ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకట రమణ, కార్యదర్శి శశికాంత్ వల్లేపల్లి, కోశాధికారి శ్రీకాంత్ పోలవరపు, తానా ఫౌండేషన్ ట్రస్టీస్ విశ్వనాథ్ నాయునిపాటి, రమాకాంత్ కోయ, రవి సామినేని, సురేష్ పుట్టగుంట, శ్రీనివాస్ చంద్ గొర్రెపాటి, కిరణ్ గోగినేని, పురుషొత్తం చౌదరి గుదే, వినయ్ మద్దినేని, శ్రీనివాస్ ఓరుగంటి, సుమంత్ రాంశెట్టి, విధ్యాధర్ గారపాటి, ప్రస్తుత తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు సహాయ సహకారాలను అందరూ అభినందించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected