Connect with us

Conference

రవి మందలపు ని వరించిన తానా మహాసభల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవి

Published

on

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (Telugu Association of North America) 23వ మహాసభలు (TANA Conference) ఫిలడెల్ఫియా మహానగరంలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో 2023 జులై 7, 8, 9 తేదీలలో నిర్వహించనున్న విషయం అందరికీ తెలిసిందే.

ఈ తానా మహాసభలు అంజయ్య చౌదరి లావు అధ్యక్షతన రవి పొట్లూరి కన్వీనర్ గా నిర్వహించనున్నారు. ఇప్పటికే నవంబర్ 5, 2022 న నిర్వహించిన కాన్ఫరెన్స్ కిక్ ఆఫ్ & ఫండ్రైజర్ బ్యాంక్వెట్ లో సుమారు 6 మిలియన్స్ కి పైగా ఫండ్స్ రైజ్ చేసిన సంగతి మీడియాలో చూశాం.

ఈ ఫండ్స్ రైజ్ చేయడంలో కీలక పాత్ర పోషించిన రవి మందలపు ని 2023 మహాసభల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవి వరించింది. దీన్ని పదవి అనేదానికంటే పెద్ద గురుతర బాధ్యత అనాలేమో. ఈ రోజు జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. తానా లో పలు బాధ్యతలు విజయవంతంగా నిర్వహించిన రవి మందలపు ఈ బాధ్యతని కూడా అలవోకగా నిర్వహిస్తారని తానా సభ్యులు అంటున్నారు.

గతంలో తానా ఫౌండేషన్ ట్రస్టీగా, తానా ఫౌండేషన్ కార్యదర్శిగా, వాషింగ్టన్ డీసీ మహాసభల ఫండ్ రైజింగ్ కమిటీ ఛైర్మన్ గా ఇలా పలు పదవులకు న్యాయం చేసిన రవి మందలపు వ్యక్తిగతంగా కూడా పెద్ద ఎత్తున విరాళాలు అందించిన చరిత్రని సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా తానా నాయకులు అందరూ రవి మందలపు ని అభినందిస్తున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected