Connect with us

Events

GWTCS సంక్రాంతి సంబరాలు ఫిబ్రవరి 4న, కృష్ణ లాం ఆధ్వర్యంలో చురుకుగా ఏర్పాట్లు

Published

on

బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) నూతన కార్యవర్గం ఈ మధ్యనే ఎన్నికైన సంగతి తెలిసిందే. 50వ వసంతంలోకి అడుగిడిన GWTCS, కృష్ణ లాం అధ్యక్షతన మొట్టమొదటి కల్చరల్ ఈవెంట్ ‘సంక్రాంతి సంబరాలు’ ఫిబ్రవరి 4వ తారీఖు, శనివారం రోజున నిర్వహించనున్నారు. ఈ సంబరాలకు జిడబ్ల్యుటిసిఎస్ మాజీ అధ్యక్షులు సత్యనారాయణ మన్నె ఒక గ్రాండ్ స్పాన్సర్ కావడం అభినందనీయం.

హెర్న్డన్ పట్టణంలోని స్థానిక హెర్న్డన్ ఉన్నత పాఠశాల ప్రాంగణం ఈ సంబరాలకు వేదిక కానుంది. ప్రముఖ వెటరన్ గాయకులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి పూర్తి చేసుకున్న సందర్భంగా GWTCS వారు ‘ఘంటసాల శతాబ్ది ఉత్సవాలు’ నిర్వహిస్తున్నారు.

అలాగే స్వచ్ఛమైన తెలుగు సంప్రదాయాలను పాటిస్తూ ఇండియాలో లాగా అరటాకుపై సహపంక్తి భోజనాలను Greater Washington Telugu Cultural Sangam (GWTCS) వారు ఏర్పాటు చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ర్యాఫుల్ బహుమతులు, షాపింగ్ స్టాల్ల్స్ ఇలా మరెన్నో ఆహ్వానితులందరినీ ఆకట్టుకోనున్నాయి.

సంక్రాంతి పండుగ సమయంలో మహిళలు అమితంగా ఇష్టపడే ముగ్గుల పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. పాల్గొనదలచిన వారు విజయ్ అట్లూరి (414-573-9719), శ్రీవిద్య సోమ (703-303-8706), లేదా competitions@gwtcs.org ని సంప్రదించండి. మధ్యాహ్నం 1:30 నుండి 3:30 వరకు నిర్వహించే ఈ ముగ్గుల పోటీలలో గెలిచిన వారికీ గోల్డ్ కాయిన్స్, గిఫ్ట్ కార్డ్స్ బహుకరించనున్నారు.

Krishna Lam
GWTCS President

ముగ్గుల పోటీల అనంతరం 4 గంటలకు మెయిన్ కార్యక్రమం మొదలవుతుంది. టికెట్స్ తదితర వివరాలకు పై ఫ్లయర్స్ చూడండి. వర్జీనియా, మేరీలాండ్ మరియు వాషింగ్టన్ డి.సి ప్రాంతాలకు చెందిన తెలుగు వారు అందరూ పాల్గొని GWTCS వారి సంక్రాంతి సంబరాలను విజయవంతం చేయవలసిందిగా జిడబ్ల్యుటిసిఎస్ కార్యవర్గ సభ్యులు కోరుతున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected