Connect with us

Cultural

తెలుగు కుటుంబాల మధ్య వైభవంగా VSS దసరా & బతుకమ్మ ఉత్సవాలు @ Atlanta, Georgia

Published

on

Atlanta, Georgia: అమెరికాలోని అట్లాంటా నగరంలో వాసవి సేవా సంఘ్ (Vasavi Seva Sangh – VSS) ఆధ్వర్యంలో దసరా, బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. బ్లిస్ ఈవెంట్ హాల్‌లో (Bliss Events & Banquet Hall) జరిగిన ఈ వేడుకలకు తెలుగు కుటుంబాలు పెద్ద సంఖ్యలో హాజరై, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల విశిష్టతను చాటిచెప్పారు.

అమెరికాలో పెరుగుతున్న భావితరాలకు తెలుగు సంస్కృతి (Telugu Culture), సంప్రదాయాలను పరిచయం చేయాలనే లక్ష్యంతో ఈ వేడుకలను నిర్వహించారు. వేడుకలు భక్తిశ్రద్ధలతో గణేశ ఆరాధనతో ప్రారంభమయ్యాయి. అనంతరం గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించేలా చేసిన అలంకరణలు, రంగురంగుల బతుకమ్మలతో పండుగ ప్రాంగణం సందడిగా మారింది.

మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్న బతుకమ్మ (Bathukamma) దసరా సంబరాలు, కోలాట ప్రదర్శనలు, పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమాల ద్వారా తెలుగు సంస్కృతిలోని గొప్పదనాన్ని, సంప్రదాయాల పరిరక్షణ ఆవశ్యకతను చాటిచెప్పారు.

సంగీత కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. మధురమైన పాటలతో పండుగ వాతావరణం మరింత ఉత్సాహభరితంగా మారింది. అతిథులకు సంప్రదాయ భారతీయ వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. వెండి నాణేల బహుమతులతో నిర్వహించిన రాఫిల్ (Raffle Prizes) కార్యక్రమం కూడా అందరినీ ఆకట్టుకుంది.

వాసవి సేవా సంఘ్ (Vasavi Seva Sangh – VSS) నిర్వహించే కార్యక్రమాల్లో ముఖ్యమైన విశేషం ఉచితంగా వేడుకలను నిర్వహించడం. కుటుంబాలు ఎలాంటి ప్రవేశ రుసుము లేకుండా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేలా సంఘం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.

తద్వారా సమాజంలో ఐక్యతను పెంపొందించడంతో పాటు, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు కృషి చేస్తోంది. ఈ వేడుకలకు పలువురు అట్లాంటా (Atlanta, Georgia) ప్రముఖులు, వివిధ సంస్థల నాయకులు హాజరయ్యారు.

కార్యక్రమానికి మహా న్యూస్ మీడియా సహకారం అందించింది. నిర్వాహకుల సమన్వయం, వాలంటీర్ల (Volunteers) సేవలు, కళాకారుల ప్రదర్శనలు, స్పాన్సర్ల సహకారం, కమ్యూనిటీ సభ్యుల చురుకైన భాగస్వామ్యంతో వేడుకలు విజయవంతమయ్యాయి.

కార్యక్రమ విజయానికి సహకరించిన స్పాన్సర్లు, వాలంటీర్లు, కళాకారులు, అతిథులు, మీడియా ప్రతినిధులు, వివిధ సాంస్కృతిక సంస్థల నాయకులకు వాసవి సేవా సంఘ్ (Vasavi Seva Sangh – VSS) నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

సాంస్కృతిక కార్యక్రమాలతో (Cultural Programs) పాటు సేవా కార్యక్రమాల ద్వారా కూడా సమాజానికి తోడ్పడుతున్న వాసవి సేవా సంఘ్ (VSS), భవిష్యత్తులోనూ తెలుగు సంప్రదాయాల పరిరక్షణ, సమాజ ఐక్యత, సేవాభావం, సాంస్కృతిక విలువలను భావితరాలకు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected