దోహా, ఖతర్ (Doha, Qatar) లోని భారతీయ సాంస్కృతిక కేంద్రం (ఐసీసీ) వేదికగా తెలంగాణ గల్ఫ్ సమితి (Telangana Gulf Samiti) ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు (Telangana Formation Day) అత్యంత వైభవంగా, ఘనంగా జరిగాయి. ఐసీసీ బుధవారం సాంస్కృతిక ఉత్సవాల చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహించబడిన ఈ కార్యక్రమానికి తెలుగు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
ఖతర్ (Doha, Qatar) లోని తెలుగు ప్రజలకు ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తున్న తెలంగాణ గల్ఫ్ సమితి (Telangana Gulf Samiti), ఆపదలో ఉన్న కార్మికులకు అండగా నిలుస్తూ, అత్యవసర పరిస్థితుల్లో సహాయ సహకారాలు అందిస్తూ, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ విశ్వసనీయ సంస్థగా గుర్తింపు పొందింది. భారత రాయబార కార్యాలయం, ఖతర్ కార్మిక మంత్రిత్వ శాఖ, అంతర్జాతీయ కార్మిక సంస్థ, కార్మిక సంక్షేమ సంస్థలతో సమన్వయంగా పనిచేస్తూ సమాజ సేవలో ముందంజలో నిలుస్తోంది.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తెలంగాణ గల్ఫ్ సమితి (Telangana Gulf Samiti) అధ్యక్షుడు శ్రీ మైదా మధు గారు, ప్రధాన కార్యదర్శి శ్రీమతి సంధ్య వినయ్ గారు నాయకత్వం వహించగా, కార్యవర్గ సభ్యులు శ్రీ భవాని సాగర్ గారు, శ్రీ దుర్గం రాజేశ్వర్ గారు, శ్రీ గడ్డి రాజు గారు, శ్రీ శంకర్ గౌడ్ గారు, శ్రీ ఎల్లయ్య తాళ్లపల్లి గారు విశేషంగా కృషి చేశారు.
అలాగే యువజన విభాగ సభ్యులు శ్రీ ముకుందం గారు, శ్రీ రాజేష్ గారు, శ్రీ ప్రవీణ్ గారు, శ్రీ అరుణ్ గారు, శ్రీ ప్రసాద్ గారు, శ్రీ సుధాకర్ గారు, శ్రీ బొల్లె రాజ గారు, శ్రీ గంగారం గారు, శ్రీ దీపక్ గారు, శ్రీ మధు గారు మరియు తెలంగాణ గల్ఫ్ సమితి (Telangana Gulf Samiti) సభ్యులందరూ కలిసికట్టుగా పనిచేసి కార్యక్రమాన్ని ఘనవిజయం చేయడంలో కీలక పాత్ర పోషించారు.
ఈ కార్యక్రమానికి దాతలుగా సహకరించిన శ్రీ హరిష్ రెడ్డి గారు, శ్రీ సాగర్ గారు, శ్రీ రాథోడ్ గారికి తెలంగాణ గల్ఫ్ సమితి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. వారి సహకారం కార్యక్రమ విజయానికి ఎంతో దోహదపడింది. ఈ మహోత్సవాన్ని విజయవంతం చేసిన కళాకారులు, ప్రేక్షకులు, స్వచ్ఛంద సేవకులు, దాతలు, సహాయదాతలు మరియు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ తెలంగాణ గల్ఫ్ సమితి (Telangana Gulf Samiti) హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తోంది.
అందరి ఆదరణ, ప్రేమ, సహకారంతో భవిష్యత్తులో మరిన్ని సేవా, సాంస్కృతిక (Cultural Programs) మరియు సామాజిక కార్యక్రమాలను మరింత ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ గల్ఫ్ సమితి (Telangana Gulf Samiti) కట్టుబడి ఉంది. సేవే మా ధ్యేయం… తెలుగు (Telugu) వారి సంక్షేమమే మా లక్ష్యం.