Connect with us

Politics

గుడివాడ మరో కొడాలి నానీని కోరుకోవడం లేదు: Atlanta NRI, Venigandla Ramu, TDP

Published

on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుడివాడ నియోజకవర్గ ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు కొడాలి నాని వల్ల గుడివాడ పేరు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ వస్తుంది. కానీ ఇప్పుడు అదే గుడివాడ పట్టణానికి చెందిన అమెరికాలోని అట్లాంటా నగర ఎన్నారై వెనిగండ్ల రాము వల్ల మళ్ళీ వార్తల్లో నిలుస్తుంది.

కాకపోతే అప్పుడు కొడాలి నాని బూతుల వల్ల, మరి ఇప్పుడేమో అందుకు విరుద్ధంగా కొత్త పంధాలో గుడివాడ అభివృద్ధే ధ్యేయంగా చాపకింద నీరులా రాజకీయం నడిపిస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త వెనిగండ్ల రాము పద్ధతుల వల్ల. వెనిగండ్ల ఫౌండేషన్ ద్వారా ఉచిత మెగా ఆరోగ్య శిబిరాలు, అన్న క్యాంటీన్లు, ఉద్యోగ మేళాలు వంటివి నిర్వహిస్తున్నారు.

గుడివాడ మరో కొడాలి నాని ని కోరుకోవడం లేదంటూ వెనిగండ్ల రాము అంటున్న మాటలు గుడివాడ ఓటర్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో బూతులతో కాకుండా స్వతహాగానే వేర్వేరు మంచి పద్ధతులలో ప్రజలను ఆకట్టుకునేలా కూడా రాజకీయం చెయ్యొచ్చు అని నిరూపిస్తున్నారు.

పలు ప్రజోపయోగకర కార్యక్రమాలతో గుడివాడ అడ్డాలో తెలుగుదేశం పార్టీ జెండాను తిరిగి రెపరెపలాడించడానికి వెనిగండ్ల రాము మదిలోని ఆలోచనలను, అలాగే ఆ ఆలోచనలను అమలుపరిచే విధానాలను మహా న్యూస్ టీవీ, ది లీడర్ విత్ వంశీ ప్రత్యేక ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకోవచ్చు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected