భారతీయ సంస్కృతిని మరియు అమెరికా సంస్కృతిని, అలాగే వారసత్వ మరియు వ్యాపార ధోరణులను దగ్గిరచేసి, తద్వారా అమెరికాలోని తెలుగువారందరూ ఉన్నత స్థానాలకు ఎదిగేలా అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ద్వారా కృషి చేయడం తన విజన్ అని అంటున్నారు రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి (RV Reddy).
వివరాలలోకి వెళితే… రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి (RV Reddy) అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రం, చికాగో (Chicago) నగరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రొఫెషనల్ గా స్థిరపడి, కమ్యూనిటీ లీడర్ గా మరియు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. తోటి తెలుగువారి ఐక్యతకు, ఉన్నతికి ఎప్పటికప్పుడు శ్రమిస్తూనే ఉన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న అమెరికా తెలుగు సంఘం (American Telugu Association – ATA) ఎన్నికలలో 2025-28 కాలానికి బోర్డ్ ఆఫ్ ట్రస్టీ గా లైఫ్ మెంబర్స్ విభాగంలో పోటీ చేస్తున్నారు రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి (RV Reddy). నామినేటింగ్ కమిటీ స్లేట్ కాండిడేట్స్ (Slate Candidates) లో కాకుండా తన పేరు అదర్ కాండిడేట్స్ లో ఉంటుంది.
ఆటా ఫ్లాగ్షిప్ కార్యక్రమాలు బతుకమ్మ (Bathukamma), 5కే రన్/వాక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శిక్షణ (IT Training), క్రికెట్, టెన్నిస్, వాలీబాల్ వంటి క్రీడా (Sports) కార్యక్రమాలు, విద్యార్థులు మరియు సీనియర్ సిటిజన్స్ మంచి చెడుల అవసరాల మేరకు పనిచేసేందుకు కట్టుబడి ఉన్నానంటున్నారు రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి (RV Reddy).
ఆటా జీవితకాల సభ్యులందరూ తనకు ఓటు వేసి గెలిపిస్తే ఆటా లో సరికొత్త దృక్కోణాలు (Fresh Perspectives) మరియు జవాబుదారీతనం (Accountability) తీసుకువస్తానని, అలాగే బలమైన శక్తిగా ఆటా ని తయారుచేయడంలో శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు.
మెయిల్ ద్వారా తమకు వచ్చిన బాలట్స్ లో రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి (RV Reddy) కి ఆటా లైఫ్ మెంబర్స్ అందరూ తమ అమూల్యమైన ఓటు వేసి అఖండ విజయం అందించేలా రిటర్న్ ఎన్వెలప్ లో డిసెంబర్ 20, శుక్రవారం లోపు తిరిగి పంపవలసిందిగా కోరుతున్నారు.