Connect with us

Politics

NRI TDP & Janasena @ Kuwait: మన టిడిపి యాప్ కి ప్రాచుర్యం కల్పించిన వారికి సన్మానం

Published

on

యన్.ఆర్.ఐ. టిడిపి మరియు జనసేన కువైట్ (Kuwait) ఆద్వర్యంలో యన్.ఆర్.ఐ. టిడిపి కువైట్ (NRI TDP Kuwait) అధ్యక్షులు అక్కిలి నాగేంద్రబాబు అద్యక్షతన 23 ఫిబ్రవరి 2024 శుక్రవారం రోజున “రా కదలి రా..” “నిజం గెలవాలి, నేజమే గెలవాలి” మరియు “శంఖారావం” కు మద్దతుగా మన టిడిపి యాప్ (Mana TDP App) ను డౌన్ లోడ్ చేసి అందరికీ తెలిసేలా చేస్తున్న పలువురికి సన్మాన సభ నిర్వహించారు.

మన టిడిపి యాప్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేసి 2,51,550 పాయింట్స్ సాదించిన దొడ్డిపల్లె సుబ్బరాజు గారు మరియు 1,15,000 పాయింట్స్ సాదించిన కుర్రా రమణా యాదవ్ గారు, అదే విదంగా లక్షకు క్రింది స్థాయిలో పాయింట్స్ సాదించిన చాలామంది నాయకులకు మరియు కార్యకర్తలకు మరియు జనసేన పార్టీ ద్వారా సేవలందించిన జనసేన (Janasena) గల్ఫ్ జాతీయ మరియు ప్రాంతీయ స్థాయి నాయకులకు, యన్.ఆర్.ఐ. టిడిపి కువైట్ సన్మాన సభను నిర్వహించింది.

భవిష్యత్తులో మన టిడిపి యాప్ (Mana TDP App) ద్వారా తెలుగుదేశం పార్టీకి (Telugu Desam Party) సేవలు అందించిన వారి వివరాలు మా దృష్టికి తీసుకొచ్చిన ప్రతిఒక్కరిని ఆహ్వానించి గౌరవించడం జరుగుతుందని యన్.ఆర్.ఐ. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నాగేంద్ర బాబు అక్కిలి తెలియచేసారు.

ఈ సన్మాన సభకు ముఖ్య అతిదులుగా శ్రీ కాంచన శ్రీకాంత్, గల్ఫ్ జనసేన (Jana Sena Party) జాతీయ కన్వీనర్, శ్రీ బాణావత్ రామచంద్ర నాయక్, గల్ఫ్ జనసేన జాతీయ కన్వీనర్, చంద్రశేఖర్ జనసేన కొకన్వీనర్, ఓబులేష్ మరియు జనసేన నాయకులు హాజరయ్యారు.

ఈ సమావేశంలో పాల్గొన్న యన్.ఆర్.ఐ. టిడిపి కువైట్ ముఖ్య సీనియర్ నాయకులు:- రాణి చౌదరి, నిర్మలా ముండ్లపాటి, సత్యవతి, రమణా యాదవ్ కుర్రా, దొడ్డిపల్లి సుబ్బరాజు, విజయ్ కుమార్ పసుపులేటి, జగదీష్, సాయిబాబా దౌర్ల, బిల్లా సత్యనారాయణ, పిడుగు నరసింహా, సుబ్బయ్య, నరసింహా యాదవ్, షేక్ రియాజ్ బాష, ఇలియాజ్ భాష, బాబు బకాల, పండు యాదవ్, సాయి యాదవ్ ఈరపరాజు పెంచల్ రాజు, మణి, రవి, యల్లాపల్లి భాస్కర్.

ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి యన్.ఆర్.ఐ. తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అధ్యక్షులు నాగేంద్ర బాబు అక్కిలి (Nagendra Babu Akkili) పెరుపేరున కృతజ్ఞతలు, దన్యవాదములు తెలియచేసారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected