Connect with us

Politics

ఉదయగిరి టీడీపీ అభ్యర్థిగా Raleigh ప్రముఖ NRI సురేష్ కాకర్ల: North Carolina

Published

on

ఆంధ్రప్రదేశ్ లో రాబోయే శాసనసభ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమి అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మరియు కొణిదెల పవన్ కళ్యాణ్ (Konidela Pawan Kalyan) కలిసి ఈరోజు ప్రకటించారు. పొత్తులో భాగంగా మొదటి విడత 118 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను నిర్ణయించారు.

తొలి విడతలో తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) కి 94 శాసనసభ స్థానాలు, జనసేన (Jana Sena Party) కి 24 శాసనసభ స్థానాలు, 3 పార్లమెంట్ స్థానాలు కేటాయించారు. కాగా టీడీపీ 94 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, జనసేన కోటాలో 5 అసెంబ్లీ (Assembly) స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు. మిగతావి ఇంకా ప్రకటించాల్సి ఉంది.

టీడీపీ నుంచి నెల్లూరు జిల్లా, ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, ర్యాలీ (Raleigh) నగరానికి చెందిన ప్రముఖ ఎన్నారై సురేష్ కాకర్ల (Suresh Kakarla) ఎంపికయ్యారు. రెండు సంవత్సరాల క్రితం అమెరికా నుంచి వెళ్లి ఉదయగిరి అసెంబ్లీ (Udayagiri Assembly Constituency) పరిధిలో సురేష్ పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలలోకి వెళ్లారు.

కాకర్ల ఛారిటబుల్ ట్రస్ట్ (Kakarla Charitable Trust) ని ఏర్పాటుచేసి మహిళా సాధికారత కోసం (Women Empowerment) వృత్తి విద్య నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు, ఇబ్బందుల్లో ఉన్నవారికి ఆర్ధికంగా మరియు హార్దికంగా తోడ్పాటు, పాఠశాలలకు సహాయం, ఆరోగ్య శిబిరాలు, అణగారిన వర్గాలకు తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలను దరిచేర్చడం వంటి వాటితో ఉదయగిరి ప్రజల మనస్సులో సుస్థిర స్థానం ఏర్పాటుచేస్తుకున్నారు.

ఉత్తర అమెరిగా తెలుగు సంఘం ‘తానా’ లో కూడా సురేష్ కాకర్ల పలు పదవులను అధిరోహించడమే కాకుండా, సేవా కార్యక్రమాల ద్వారా అపలాచియన్ ప్రాంతంలో తానా (TANA) ఎదుగుదలకి పాటుపడ్డారు. సురేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోకి దిగడంతో, తన ఆప్త మిత్రుడు రాజేష్ యార్లగడ్డ (Rajesh Yarlagadda) తానా ర్యాలీ చాప్టర్ బాధ్యతలు తీసుకున్నారు.

ఈ మధ్యనే ముగిసిన తానా ఎన్నికలలో అపలాచియన్ (Appalachian Region) ప్రాంత రీజినల్ కోఆర్డినేటర్ గా రాజేష్ విజయదుందుభి మోగించారు కూడా. తన ఆప్త మిత్రుడుకి ఉదయగిరి అభ్యర్థిత్వం దక్కిన సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ.. మొదటినుండీ సురేష్ సేవాదృక్పథం కలిగినవాడని, తనలాంటి విద్యావంతులు, ప్రజల మనిషి రాజకీయాలలోకి వెళ్లడం శుభసూచకమని, తన మిత్రుడు గెలిచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో తప్పకుండా అడుగెడతాడని అన్నారు.

అలాగే ర్యాలీ టీడీపీ (Raleigh TDP) నాయకులలో, కార్యకర్తల్లో ఆనందం వెల్లివిరిసింది. తమతోపాటు కలిసిమెలిసి ఉంటూ ర్యాలీ నగరంలో ఇటు తెలుగుదేశం, అటు తానా కార్యక్రమాలను పరుగులెత్తించిన సురేష్ కి సరైన సమయంలో నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) టికెట్ ఇచ్చి ప్రోత్సహించడం అభినందనీయం అంటూ స్నేహితులు కేరింతలు కొడుతున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected