గత మూడు దశాబ్దాలుగా అమెరికాలో గురు రాజా (Guru Raja) గారు స్థిరపడినప్పటికీ, అక్కడే పరిమితం కాకుండా మన తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం “నేను సైతం” అంటూ NRI TDP బాధ్యతలను స్వీకరించి, పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు.
కుటుంబానికి, వ్యక్తిగత జీవితానికి సైతం సమయాన్ని త్యాగం చేస్తూ, పార్టీ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతూ, ముఖ్యంగా లోకేష్ (Nara Lokesh) గారి ఆశయాలకి అనుగుణం గా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ యువతకు, మహిళలకు పార్టీలో అత్యున్నత ప్రాధాన్యత కల్పించడంలో రాజా గారు ముందువుంటారు అని తెలియచేసారు.
విదేశాలకు చదువుల కోసం వచ్చే విద్యార్థులకు అండగా నిలుస్తూ, వారి సమస్యల పరిష్కారానికి తన వంతు సహాయం అందిస్తూ, తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) మళ్లీ మళ్లీ అధికారంలోకి ఎందుకు రావాలో వివరిస్తున్నారని కొనియాడారు.
అందరిలోనూ నూతన స్ఫూర్తిని నింపుతున్న మీ సేవలు ప్రశంసనీయం అని యునైటెడ్ కింగ్డమ్ (United Kingdom) నుంచి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన NRI TDP యూకే విభాగం నాయకులు రవితేజ లింగ గారు మరియు తెలుగుదేశం అభిమానులు.