Frankfurt, Germany: చంద్రబాబు గొప్ప దార్శనికుడు, దేశం గర్వించదగ్గ నేత అని జర్మన్ తెలుగుదేశం నాయకులు శ్రీకాంత్ కుడితిపూడి కొనియాడారు. 20-4-2026 ఆదివారం జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నగరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి, బెలూన్లు ఎగురవేసి పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు.
ఫ్రాంక్ఫర్ట్ లో జరిగిన కార్యక్రమాన్ని పవన్ కుర్ర, సుమంత్ కొర్రపాటి తదితరులు సమన్వయపరిచారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో రోడ్డునపడ్డ తెలుగు జాతి పూర్వవైభవాలు తెచ్చేందుకు చంద్రబాబు (Nara Chandrababu Naidu) అలుపెరుగని పోరాటం చేస్తున్నారు.
పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా ఉద్యోగ,ఉపాది అవకాశాలను అన్వేషిస్తున్నారు. రాజధాని అమరావతి (Amaravathi) కి చట్టబద్దత కల్పించి, దాని నిర్మాణం పూర్తిచేయడానికి చంద్రబాబు (Nara Chandrababu Naidu) అహోరాత్రులు శ్రమిస్తున్నారు.
పవన్ కుర్ర మాట్లాడుతూ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి లాంటి అత్యునత పదవులకు అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు (Nara Chandrababu Naidu) కీలక పాత్ర పోషించారు. 76 సంవత్సరాల వయస్సు లో కూడా ప్రజలు, రాష్ట్రాభివుద్ది కోసం శ్రమిస్తున్నారు.
సుమంత్ కొర్రపాటి మాట్లాడుతూ చంద్రబాబు (Nara Chandrababu Naidu) జాతీయ రాజకీయాలలో చురుకైన పాత్రపోషిస్తున్నారు. ఆధునిక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు ప్రపంచ పటం లో గుర్తింపు తెచ్చారు.