Connect with us

Schools

25 పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ఏర్పాటు; TTA Seva Days @ Yadadri, Samsthan Narayanapur

Published

on

TTA సేవా డేస్ లో భాగంగా 4వ రోజు మరో అద్భుత కార్యానికి తెర లేపింది. గవర్నమెంట్ పాఠశాల విద్యార్థులకు అవసరమయ్యే కార్పొరేట్ స్థాయి విద్య అందించడానికి డిజిటల్ తరగతులు (Digital Classrooms) ఏర్పాటు చేయడానికి యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణ్ పూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాట్లు చేసింది. దీనికి Chief Guest గా TTA President Vamshi Reddy Kancharakuntla వచ్చారు. Sponsor Mayur Reddy Bandaru గారు ఈ ఒక్క రోజు 25 స్కూల్ లకు డిజిటల్ క్లాస్ రూం సామాగ్రి అందించారు.

ప్రభుత్వ పాఠశాల ప్రధాన అధ్యాపకులు మరియు ఉపాధ్యాయులు TTA బృందానికి సాదరంగా స్వాగతం పలికారు. సంస్థాన్ నారాయణ పురం లో పాటశాల అవరణలో ఏర్పాటు చేసిన సరస్వతిమాత విగ్రహానికి పూలమాలలు అర్పించిన TTA ప్రసిడెంట్ వంశీ రెడ్డి కంచరకుంట్ల బృందాన్ని సాదరంగా వేదికపైకి పాఠశాల యాజమాన్యం ఆహ్వానించి గౌరవించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు మయుర్ రెడ్డి గారి అత్తమ్మ విమల – కృష్ణ రెడ్డి దంపతులు ఆకర్షణ నిలిచారు.

గ్రామ సర్పంచ్ శ్రీహరి గారు మాట్లాడుతూ.. TTA సభ్యులకు అభివాదాలు తెలియజేశారు. ఇక్కడ విద్యార్థుల ప్రతిభకు పట్టం కట్టేందుకు డిజిటల్ క్లాస్ రూం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. మరిన్ని కార్యక్రమాలతో మా గ్రామం ను సందర్శించాలని అక్షించారు. MPTC గాలయ్య మాట్లాడుతూ.. టెక్నాలజీనీ మారుమూల ప్రాంతాలకు సేవా భావంతో అందించిన TTA బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రధానోపాధ్యాయులు రమాదేవి మాట్లాడుతూ.. TTA బృందం ఇచ్చిన ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలిపారు. TTA సభ్యులు మయూర్ రెడ్డి వల్ల మోటివేషన్ లభించిందని ఉపాధ్యాయుల కొరత తీర్చేందుకు ఈ డిజిటల్ క్లాస్ రూం లు చాలా ఉపయోగపడతాయి అని తెలిపారు. MMP రమేష్ గారు మాట్లాడుతూ మయుర్ రెడ్డి గారు సేవాభావం కలిగిన కుటుంబంలో జన్మించారని, వారి కుటుంబం సేవా కార్యక్రమాలలో ముందుంటుందని కొనియాడారు. TTA సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞత లు తెలిపారు.

DEO నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ.. మయుర్ రెడ్డి గారు ఇప్పటికే నియోజక వర్గం అంతా డిజిటల్ క్లాస్ రూం లు ఏర్పాటు చేయడం ద్వారా పిల్లలకు ఎంతో ఉపయోగం కలిగిందని తెలిపారు. TTA (Telangana American Telugu Association) బృందానికి కృతజ్ఞత లు తెలిపారు. TTA ప్రసిడెంట్ వంశీ రెడ్డి మాట్లాడుతూ.. వేదికనలకరించిన ప్రతి ఒక్కరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.

గ్రామాలకు చెందిన తమ సభ్యులు అందరూ ఈ రకమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. మయుర్ రెడ్డి గారు ఇక్కడే కాదు అమెరికా లో కూడా ఇదే రకమైన సహాయ సహకారాలు అందజేస్తున్నారు అందుకు మాయూర్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. సంస్థాన్ నారాయణపురం లో డిజిటల్ క్లాస్ రూం దాత మయూర్ రెడ్డి గారు మాట్లాడుతూ.. ప్రభుత్వ స్కూల్ లలో విద్యార్థులు ఎక్కువ ఉపాద్యాయులు తక్కువగా ఉండటం తనను కలిచి వేసింది అని తెలిపారు.

డిజిటల్ క్లాస్ రూం (Digital Classroom) ఉపాధ్యాయులకు ఆల్టర్నేట్ కాదని, కానీ వారికి సరైన విధంగా వీటిని ఉపయోగించు కావాలని కోరారు. విద్యార్థులతో కలిసి వారికి సరైన మార్గాన్ని అధ్యాపకులు అందించాలని కోరారు. పిల్లల ప్రేమ చూరగొన్న పాఠశాల బయాలజీ టీచర్ అరుణ గారికి TTA బృందం 5వేల బహుమతి ఇచ్చి ప్రోత్సహించారు.

TTA ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ రెడ్డి మలిపెద్ది గారు మాట్లాడుతూ.. ఈ గ్రామానికి తమను తీసుకుని వచ్చిన మయూర్ రెడ్డి కి కృతజ్ఞత లు తెలిపారు. ప్రభుత్వ పాటశాల కు డిజిటల్ క్లాస్ రూం ఇవ్వడం పిల్లలను మరో లెవెల్ కు తీసుకువెళ్లడం అని అన్నారు. TTA సేవా డేస్ కో. ఆర్డినేటర్ సురేష్ గారు మాట్లాడుతూ.. వివిధ ప్రాంతాలలో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అదే విధంగా ప్రభుత్వ పాఠశాల పిల్లలు ప్రపంచ వ్యాప్తంగా ఎదగాలని ఇక్కడ డిజిటల్ క్లాస్ రూం లు ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు.

దివ్యాంగులకు సహకరించాలని కోరిన ఉపాధ్యాయుల విన్నపాన్ని మన్నించి వెంటనే స్పందించిన TTA సేవా డేస్ కో ఆర్డినేటర్ సురేష్ గారు వారికి తప్పకుండా సహకరిస్తామని మాట ఇచ్చారు. తదనంతరం డిజిటల్ క్లాస్ రూం ఏక్విప్మెంట్ పాఠశాల ఉపాధ్యాయులకు TTA బృందం అందించింది. మండలం లోని 25స్కూల్ లకు మయూర్ రెడ్డి గారు డిజిటల్ క్లాస్ రూం ఏక్విప్ మెంట్ అందించారు.

డిజిటల్ క్లాస్ రూం (Digital Classrooms) ప్రారంభోత్సవానికి స్థానిక ప్రభుత్వ పాఠశాల కు వచ్చిన TTA సభ్యులకు సాదర ఆహ్వానం పలికిన పిల్లలు రోజా పువ్వులతో స్వాగతించారు. తదనంతరం డిజిటల్ క్లాస్ రూం ను స్థానిక DEO నారాయణరెడ్డి గారితో కలిసి TTA ప్రసిడెంట్ వంశీ రెడ్డి మరియు TTA సభ్యులు ప్రారంభించారు. పిల్లల కోలాహలం మధ్య TTA సభ్యులు తమ చిన్న తనాన్ని గుర్తు చేసుకుని అనందం వ్యక్తం చేశారు.

మయూర్ రెడ్డి (Mayur Reddy Bandaru) గారికి స్థానిక నాయకులు మరియు పాఠశాల అధ్యాపకులు శాలువాతో సన్మానించి మేమోంటో అందించారు. TTA సభ్యులు స్థానిక నాయకులు మరియు ఉపాద్యాయులను సన్మానించి మేమొంటో లు అందజేశారు. తదనంతరం అక్కడకు దగ్గర లోని జులుకాలువ ప్రభుత్వ పాఠశాలలో మాయూర్ రెడ్డి గారు ఆట వస్తులు దానంగా ఇచ్చారు. పిల్లల కోలాహలం ఆట వస్తువుల మధ్యలో పిల్లలతో TTA బృందం సందడి చేసింది.

సేవాడేస్ (TTA Seva Days) కార్యక్రమానికి కోఆర్డినేటర్ గా సురేష్ రెడ్డి వెంకన్నగారి గారు, INDIAN కోఆర్డినేటర్ గా డా. డి ద్వారకనాథ రెడ్డి గారు, కో – కోర్డినేటర్ గా దుర్గా ప్రసాద్ సెలోజ్ గారు, ఫౌండేషన్ సర్వీస్ చైర్ గా సంతోష్ గంటారం గారు, ఇంటెర్నేషనల్ వైస్ ప్రసిడెంట్ గా ప్రసాద్ కునారపు గారు, హెల్త్ అండ్ వెల్నెస్ అడ్వైసర్ గా జ్యోతిరెడ్డి దూదిపాల గారు, నర్సింహా పెరుక గారు – కమ్యూనిటీ సర్వీసెస్ చైర్ గా, ప్రసిడెంట్ గా వంశిరెడ్డి కంచరకుంట్ల గారు మరియు ప్రసిడెంట్ ఎలెక్ట్ గా నవీన్ రెడ్డి మలిపెద్ది గారు, కార్యదర్శిగా కవితారెడ్డి గారు భాద్యతలు నిర్వహిస్తున్నారు.

సేవా డేస్ లో పాల్గొన్న TTA సభ్యులు

Shiva Reddy Kolla – Joint Secretary
Manohar Bodke – Joint Treasurer
Pradeep Mettu – National Coordinator
Ganesh Veeramaneni – Ethics Committee Director
Sangeetha Reddy – Board of Director
Venkat Gaddam – Board of Director
Pradeep Boddu, Abhilash Reddy,
Anil Arraballi, Vani Gaddam
Sridhar Chaduvu, Aahlaad Kareddy

తెలుగు కళల తోట తెలంగాణ సేవల కోట అనే నినాదంతో 2015 లో తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ స్థాపించబడినది. తెలంగాణ తరుపున విదేశాలలో ఏర్పడిన మొట్టమొదటి సాంస్కృతిక సంస్థ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్. TTA Founder Pailla Malla Reddy Garu, Advisory Consul Chair – Vijayapal Reddy గారు, Co-Chair – Mohan Patalolla గారు, Member – Bharat Reddy Madadi గార్ల ఆధ్వర్యంలో 2015 లో మొదలై, ప్రస్తుత ప్రెసిడెంట్ వంశిరెడ్డి కంచరకుంట్ల గారి ఆధ్వర్యంలో ఇప్పటికే ఎన్నో సేవాకార్యక్రమాలతో దూసుకుపోతున్నది.

తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) తెలుగు రాష్ట్రాలలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే సేవ డేస్ కార్యక్రమాన్ని ఈసంవత్సరం కూడా నిర్వహించ తలపెట్టింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ప్రెసిడెంట్ వంశీ రెడ్డి కంచరకుంట్ల మరియు ప్రసిడెంట్ ఎలెక్ట్ నవీన్ రెడ్డి మలిపెద్ది గారు, సేవాడేస్ కార్యక్రమానికి కోఆర్డినేటర్ సురేష్ రెడ్డి వెంకన్నగారి గారు ప్రజలను కోరారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected