Connect with us

Schools

పేద విద్యార్థులకు తానా బ్యాగుల పంపిణీ @ Warren, Detroit, Michigan

Published

on

అమెరికాలోని పేదవాళ్ళకు సహాయం చేసేందుకు వీలుగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) మాజీ అధ్యక్షులు డా. నవనీతకృష్ణ గొర్రెపాటి ప్రవేశపెట్టిన తానా బ్యాక్‌ ప్యాక్‌ కార్యక్రమంలో భాగంగా డెట్రాయిట్‌ లోని మౌండ్‌ పార్క్‌ ఎలిమెంటరీ స్కూల్‌ (Mound Park Elementary School) విద్యార్థులకు స్కూల్‌ బ్యాగ్‌ లను పంపిణీచేశారు.

డిటిఎ (Detroit Telugu Association) మాజీ ప్రెసిడెంట్‌ నీలిమ మన్నె, తానా (Telugu Association of North America) నాయకులు సునీల్‌ పంట్ర, జేఆర్‌. శ్రీనివాస్‌ గోగినేని సహాయంతో దాదాపు 400 మంది విద్యార్థులకు ఈ బ్యాగ్‌ లను అందించారు.

ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ నాయకులు (Community Leaders) వెంకట్‌ ఎక్కా, వినోద్‌ కుకునూర్‌, రాంప్రసాద్‌ చిలుకూరు, కిరణ్‌ దుగ్గిరాల, సుబ్రత గడ్డం, సుధీర్‌ కట్ట, జోగేశ్వరరావు పెద్దిబోయిన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బ్యాగ్‌లను పంపిణీ చేసిన దాతలకు స్కూల్‌ నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected