Connect with us

Blood Drive

Phoenix, Arizona: రక్తదాన కార్యక్రమంతో AP మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కు సేవా నివాళి

Published

on

ప్రజలతో మమేకమైన నాయకుడిని స్మరించుకోవడానికి మాటలకంటే సేవే గొప్ప నివాళి. అదే భావనతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా YSRCP Phoenix NRI Committee ఆధ్వర్యంలో, Vitalant సహకారంతో సెప్టెంబర్ 6న ఫీనిక్స్‌లో (Phoenix, Arizona) రక్తదాన శిబిరం నిర్వహించారు.

వైఎస్సార్ (Yeduguri Sandinti Rajasekhara Reddy) రాజకీయ నాయకుడిగా ఎదగకముందు వైద్యుడు. ప్రజల ఆరోగ్యం, పేదలకు వైద్యం అందుబాటులో ఉండాలనే ఆలోచన ఆయన రాజకీయ జీవితంలోనూ కనిపించిందని కార్యక్రమంలో పాల్గొన్నవారు గుర్తు చేసుకున్నారు.

అలాంటి నాయకుడి వర్ధంతిని రక్తదానం వంటి ప్రాణదాన కార్యక్రమంతో నిర్వహించడం ఆయన సేవా స్ఫూర్తికి సరైన నివాళిగా భావిస్తున్నామని తెలిపారు. YSRCP నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులతో పాటు స్థానిక తెలుగు సమాజానికి చెందిన పలువురు ఈ రక్తదాన శిబిర (Blood Donation Drive) కార్యక్రమంలో పాల్గొన్నారు.

వైఎస్సార్ (Y. S. Rajasekhara Reddy) చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రాజకీయాలకు అతీతంగా ఒకరి రక్తదానం మరొకరి ప్రాణాన్ని నిలబెట్టగలదనే సందేశాన్ని ఈ సందర్భంగా నిర్వాహకులు ముందుకు తీసుకెళ్లారు.

ఈ కార్యక్రమాన్ని YSRCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, Global NRI Coordinator, మాజీ ముఖ్యమంత్రి విద్యాశాఖ సలహాదారు ఆలూరు సాంబశివ రెడ్డి (Aluru Sambasiva Reddy) వర్చువల్‌గా ప్రారంభించారు. వైఎస్సార్ ప్రజలతో ఏర్పరచుకున్న అనుబంధాన్ని, ఆయన పాలనలో అమలైన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.

వాలంటీర్లు (Volunteers), రక్తదాతలు, స్థానిక కమ్యూనిటీ సభ్యులు కార్యక్రమ విజయానికి సహకరించారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ సామాజిక బాధ్యతను మరచిపోకుండా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ రక్తదాన శిబిరం నిర్వహణలో ధీరజ్ పోల, వంశీ ఇరువారం (Vamsi Krishna Reddy Eruvaram), చెన్నా రెడ్డి మద్దూరి (Chenna Reddy Madduri), రుక్మానంద, శ్రీధర్ చెమిడ్తి, అంజి రెడ్డి, నగేష్ పోర్ల, వేమ శేఖర్, విఘ్నేష్, కొండా రెడ్డి, శ్రీనివాస్ మామిడి, హేమ కుమార్, అజయ్ కల్వా, కుడుముల సుధీర్, సుజన్, రాజేశ్వరరావు బండారు, రాజశేఖర్ అవుదూరి, హితేష్, అనుదీప్, సుబ్బు, గోకుల్, రామ్‌కోటి, ఉదయ్ తదితరులు కీలకంగా వ్యవహరించారు.

వైఎస్సార్‌ను (YSR) స్మరించుకోవడం అంటే ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించడమే కాకుండా, ఆయనలో కనిపించిన ప్రజాసేవా భావాన్ని కొనసాగించడం కూడా అని నిర్వాహకులు పేర్కొన్నారు. ఒకరి జ్ఞాపకం సమాజానికి ఉపయోగపడే పనిగా మారినప్పుడు ఆ నివాళికి మరింత అర్థం వస్తుందని ఫీనిక్స్‌లో (Phoenix, Arizona) జరిగిన ఈ రక్తదాన కార్యక్రమం చాటిచెప్పింది.

error: NRI2NRI.COM copyright content is protected