Connect with us

Blood Drive

AAA Pennsylvania & Delaware Chapter ఆధ్వర్యంలో విజయవంతంగా రక్తదాన శిబిరం

Published

on

Pennsylvania & Delaware: ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) పెన్సిల్వేనియా & డెలావేర్ విభాగం అమెరికన్ రెడ్ క్రాస్ (American Red Cross) సహకారంతో, సెప్టెంబర్ 13, 2026న డౌనింగ్‌టౌన్ (Downingtown), పెన్సిల్వేనియాలో రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించింది.

ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) వ్యవస్థాపకులు శ్రీ హరి మోటుపల్లి (Hari Motupalli) గారి సహకారంతో, కొత్త నాయకత్వ బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన వారు శ్రీమతి హారిక పెద్దిరెడ్డి, శ్రీ హేమంత్ దొమ్మరాజు, శ్రీ తేజో ప్రకాష్ రెడ్డివారి మరియు శ్రీమతి దివ్య కీర్తి మలినేని (Divya Malineni).

ఈ AAA Pennsylvania & Delaware Chapter కార్యక్రమానికి సమాజం నుండి విశేష స్పందన లభించింది. ఎంతోమంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం (Blood Donation) చేసి, ఈ గొప్ప సేవా కార్యక్రమానికి తమ మద్దతు అందించారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన రక్తదాతలు, వాలంటీర్లు, సమన్వయకర్తలు మరియు ప్రతి ఒక్కరికీ ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AndhraPradesh American Association – AAA) నాయకత్వ బృందం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.

మనమంతా కలిసి ప్రాణాలను కాపాడుదాం… సమాజంలో మార్పు తీసుకువద్దాం. ఐక్యత, సేవాభావం, సమాజ శ్రేయస్సే మా లక్ష్యం అని ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) పెన్సిల్వేనియా & డెలావేర్ విభాగం (AAA Pennsylvania & Delaware Chapter) నాయకత్వ సభ్యులు అన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected