Connect with us

Convention

మార్చి 12న ఆటా 17వ మహాసభల కర్టెన్ రైజర్

Published

on

అమెరికన్ తెలుగు అసోసియేషన్ ‘ఆటా’ 17వ మహాసభలు వాషింగ్టన్ డీసీ లోని వాల్టర్ కన్వెన్షన్ సెంటర్లో 2022 జులై 1-3 తేదీలలో నిర్వహించనున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ మహాసభలలో అతిరధ మహారధులు ఎందరో పాల్గొననున్నారు. భువనేశ్ బుజాల అధ్యక్షతన, సుధీర్ బండారు కన్వీనర్ గా ఆటా 17వ మహాసభలు నిర్వహించనున్నారు.

ఈ మహాసభలకు రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం ‘కాట్స్’ కోహోస్టుగా ఉంది. దీనికోసం ఆటా 17వ మహాసభల కర్టెన్ రైజర్ ఈవెంట్ మార్చి 12న వర్జీనియాలోని హిల్టన్ హోటల్లో ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో ఆటా బోర్డు సభ్యులు మరియు మహాసభల టీంతో ముఖాముఖీ, సాంస్కృతిక కార్యక్రమాలు, మ్యూజికల్ నైట్ తదితర కార్యక్రమాలు హైలైట్స్ కానున్నాయి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected