తెలంగాణ అమెరికా తెలుగు సంఘం మూడు రోజుల మహాసభలలో (TTA Mega Convention) భాగంగా చివరి రోజు కీరవాణి సంగీత విభావరితో చార్లెట్ నగర ప్రవాసులు మంత్రముగ్ధులయ్యారు. దీంతో TTA కన్వెన్షన్ కి ఘనమైన ముగింపు పలికినట్టైంది.
TTA కన్వెన్షన్ (TTA Convention) మూడో రోజున ఉదయాన్నే పండితులు శ్రీ శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని (Sri Srinivasa Kalyanam) శుభప్రదంగా నిర్వహించారు. కల్యాణోత్సవం అనంతరం అందరూ ఆశీర్వచనాలు, ప్రసాదం అందుకున్నారు.
వివిధ ఎక్సిబిట్ రూమ్స్ (Exhibit Rooms) లో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలు వేటికవే సాటి అనేలా సాగాయి. బ్యూటీ పాజంట్ ఫైనల్స్, వివిధ రాజకీయ పార్టీల సమావేశాలు, బిజినెస్ సెమినార్స్, సాహితీ సమావేశం, సెలబ్రిటీ మీట్ & గ్రీట్, కాలేజీల ఎన్నారై మీట్స్ వంటి బ్రేకౌట్ సెషన్స్ నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలను (Telangana Culture) ప్రతిబింబిస్తూ ఏర్పాటు చేసిన ఫోటోబూత్స్, సెట్టింగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఆహ్వానితులందరూ ఫోటోలు దిగుతూ కన్పించారు. మహిళలు వెండర్ బూత్స్ (Vendor Stalls) దగ్గిర కోలాహలంగా తిరిగారు.
సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Programs) వీనుల విందుగా సాగాయి. $50K, $100K డోనార్స్ ని, కార్పొరేట్ స్పాన్సర్స్ ని ఘనంగా సత్కరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క, మాజీ శాసన సభ్యులు ఎర్రబెల్లి దయాకరరావు, రసమయి బాలకిషన్ తదితరులను సన్మానించారు.
ఈ సందర్భంగా AIG హాస్పిటల్స్ స్థాపకలు, పద్మ విభూషణ్ డా. దువ్వూర్ నాగేశ్వర రెడ్డి (Dr. Duvvur Nageshwar Reddy) కి TTA కార్యవర్గం, బోర్డు సభ్యులు మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ సమక్షంలో TTA జీవన సాఫల్య పురస్కారాన్ని (Lifetime Achievement Award) అందించారు.
ఈ సందర్భంగా డా. నాగేశ్వర రెడ్డి తన అమెరికా మరియు ఇండియా అనుభవాలను పంచుకున్నారు. వచ్చీరావడంతోనే వేదిక పైన డాన్సులతో హీరో నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) అలరించారు. తర్వాత యువతను ఉద్దేశించి మాట్లాడుతూ అందరినీ నవ్వించారు.
TTA నాయకులు శాలువా, పుష్పగుచ్చంతో నవీన్ పోలిశెట్టి (Hero Naveen Polishetty) ని సన్మానించారు. ఇక పరంపర టీం వారు TTA కన్వెన్షన్ లోగోలో ఉన్న సేవ, బంధం, ఐక్యత చాటుతూ చేసిన నృత్యంతో స్టాండింగ్ ఒవేషన్ (Standing Ovation) అందుకున్నారు.
TTA సేవాడేస్, 10 వసంతాల జర్నీ వీడియో ప్రజంటేషన్ TTA సేవానిరతిని చాటిచెప్పినట్లైంది. ఎప్పటిలానే యాంకర్స్ సుమ (Suma Kanakala) మరియు రవి (Anchor Ravi) అందరినీ నవ్విస్తూ కార్యక్రమాలను ఉత్సాహంగా ముందుకు నడిపించారు.
ఆ తర్వాత, TTA ప్రస్తుత అధ్యక్షులు నవీన్ రెడ్డి మల్లిపెద్ది (Naveen Reddy Mallipeddi), TTA కన్వెన్షన్ కన్వీనర్ ప్రవీణ్ చింతా (Praveen Chintha), కోఆర్డినేటర్లు నరేన్ దేవరపల్లి, శేఖర్ రెడ్డి లను కుటుంబ సమేతంగా వేదిక మీదకు ఆహ్వానించి సన్మానించారు.
ఈ సందర్భంగా వీరు ఈ కన్వెన్షన్ నిర్వహణ వివరాలు పంచుకొని అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వివిధ కన్వెన్షన్ (Convention Committees) కమిటీల సభ్యులను వేదిక మీదకు ఆహ్వానించి గత మూడు నెలలుగా వారు చేస్తున్న సేవలను, సహనాన్ని కొనియాడారు.
చివరిగా తెలుగు సినీ సంగీత దర్శకులు కీరవాణి (MM Keeravani) తనదైన శైలిలో మ్యూజికల్ కాన్సర్ట్ తో అందరినీ అలరించారు. దీంతో TTA Charlotte Convention 2026 కి ఘనమైన ముగింపు పలికినట్లైంది. తదుపరి అధ్యక్షునిగా సహోదర్ రెడ్డి ని నియమించారు.
తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (Telangana American Telugu Association – TTA) మెగా కన్వెన్షన్ మూడవ రోజు కార్యక్రమాలకు సంబంధించి మరిన్ని ఫోటోల కొరకు www.NRI2NRI.com/TTA Mega Convention in Charlotte Day 3 ని సందర్శించండి.