Connect with us

Politics

చంద్రబాబు అరెస్టుపై నిరసన తెలిపిన ప్రవాసులు @ Minneapolis, Minnesota

Published

on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖమంత్రి, తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అధినేత, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అనైతిక అరెస్టుకు, వారిపై అప్రజాస్వామిక దాడికి నిరసనగా ప్రవాస తెలుగు వారు మిన్నియాపోలిస్, మిన్నెసోటా (Minnesota) నగరంలో పలుసార్లు పలుచోట్ల సమావేశమై సంగీభావం తెలపడం జరిగింది.

ప్రజాస్వామ్య విలువలను పక్కనపెట్టి, రాజకీయ వ్యవస్థలో ముఖ్యమైన విపక్షాలను మట్టుపెట్టే దిశగా ఆంధ్ర రాష్ట్ర (Andhra Pradesh) పాలకుల వ్యవహారశైలిని ఖండిస్తూ, నాలుగున్నర దశాబ్దాల మచ్చలేని రాజకీయ నాయకుడు, నిజాయితీ మరియు సుపరిపాలనకు మారు పేరైన నారా చంద్రబాబునాయుడు గారిపై జరుగుతున్న అప్రజాస్వామిక దాడికి నిరసనగా, పెద్ద సంఖ్యలో మహిళలు, పిల్లలు, పెద్దలు కలిసి చంద్రబాబు నాయుడికి సంఘీభావం తెలిపారు.

ఈ సమావేశాలు NRI TDP కమిటి సభ్యులు మరియు NRI జనసేన వారితో పాటు పలు కమ్యూనిటీ లీడర్ల ఆద్వర్యంలో We Are With CBN మరియు Save Democracy అనే నినాదాలతో సమైక్యంగా చంద్రబాబు (Nara Chandrababu Naidu) కి సంఘీభావం ప్రకటించాయి.

error: NRI2NRI.COM copyright content is protected