Connect with us

News

కమ్యూనిటీ సర్వీస్ ఈస్ మై పాషన్: Bay Area కుర్రాడు వెంకట్ కోగంటి

Published

on

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం, బే ఏరియా (Bay Area) లో సెటిల్ అయిన కృష్ణా జిల్లా, కంచికచెర్ల మండలం, చెవిటికల్లు వాసి వెంకట్ కోగంటి తెలుగువారికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఉద్యోగరీత్యా 2004 లో అమెరికా విచ్చేసిన వెంకట్ కోగంటి (Venkat Koganti) సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ గా పనిచేస్తున్నారు.

తన కుటుంబం, జాబ్ ఒక వైపు అయితే సామాజిక స్పృహ మరోవైపు. మొదటి నుండి బే ఏరియా లో అందరిలో ఒకడై తన పరిధి మేరకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్థానిక బే ఏరియా తెలుగు సంఘం (BATA), అసోసియేషన్ ఆఫ్ ఇండియన్స్ ఇన్ అమెరికా (AIA), శంకర్ ఐ ఫౌండేషన్, శాన్ రామన్ క్రికెట్ అసోసియేషన్, ఆశాజ్యోతి వంటి సంస్థలకు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు.

ఇక జాతీయ స్థాయిలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) కి బే ఏరియా లో కీలక వ్యక్తిగా వ్యవహరిస్తున్నారు. ఎప్పుడో 15 సంవత్సరాల క్రితమే తానాలో సభ్యునిగా చేరిన వెంకట్ కోగంటి జాయింట్ ట్రెజరర్ గా, బిజినెస్ డెవలప్మెంట్ ఛైర్ & కోఛైర్ గా, 2011 మహాసభల జాబ్ ఫెయిర్ కమిటీ సభ్యునిగా వివిధ సేవలందించారు. ప్రతి తానా కన్వెన్షన్ కి ఇతోధికంగా ఆర్ధిక సహాయం చేస్తూనే ఉన్నారు. 2015-21 మధ్య కాలంలో తానా పాఠశాల అభివృద్హికి తోడ్పడ్డారు.

ముఖ్యంగా 2019-21 సమయంలో తానా జాయింట్ ట్రెజరర్ గా ఆర్ధిక లావాదేవీల విషయంలో పారదర్శకంగా (Transparency) వ్యవహరించారు. ఇదే సమయంలో తానా పత్రిక కోసం 10 వేల డాలర్లు రైజ్ చేశారు. 2011 నుండి ఇప్పటి వరకు కూడా తానా బ్యాక్ ప్యాక్ ప్రాజెక్ట్ (TANA Backpack Project) కి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. తానా 5కె వాక్/రన్, తానా వనభోజనాలు, తానా స్పోర్ట్స్, తానా బోన్ మారో డ్రైవ్ కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహించారు.

బే ఏరియా లో తానా టీం స్క్వేర్ (TANA TEAM Square) కార్యకలాపాలకు సహకారమందించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో కాలిఫోర్నియా లోని పలు ప్రాంతాల్లో ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు ఫుడ్ ప్యాకెట్స్ అందించి తన దయార్ద్ర హృదయాన్ని చాటుకున్నారు. హోంలెస్ షెల్టర్స్ (Homeless Shelters) కోసం ఫుడ్ డ్రైవ్స్ నిర్వహించారు. ఎప్పటికప్పుడు తానా మెంబర్షిప్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు.

అలాగే మాతృభూమి ఋణం తీర్చుకునేలా ఇండియాలో పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు (Scholarships), వికలాంగులకు ట్రై సైకిళ్ళు, కోవిడ్ (COVID) సమయంలో ఫేస్ మాస్క్స్, ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేశారు వెంకట్ కోగంటి (Venkat Koganti). హుద్ హుద్ మరియు తిట్లి తుఫాను బాధితుల సహాయార్ధం బే ఏరియా (Bay Area, California) నుండి ఫండ్స్ రైజ్ చేసి పంపారు.

ఏపీ జన్మభూమి (AP Janmabhoomi) ద్వారా తను పుట్టి చదువుకున్న ఊరిలోని పాఠశాలకు డిజిటల్ క్లాసెస్ (Digital Classes) ఏర్పాటు చేశారు. తానా చైతన్య స్రవంతి కార్యక్రమాలకు హాజరవ్వడమే కాకుండా ఇతోధికంగా సహాయం చేశారు. వర్ధమాన కళాకారులను ప్రోత్సహించేలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు.

ఇటు అమెరికాలో అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో తానా ద్వారా మరియు వ్యక్తిగతంగా పలు సేవలందిస్తూ వస్తున్న వెంకట్ కోగంటి (Venkat Koganti) ప్రస్తుత తానా (TANA) ఎన్నికలలో టీం కొడాలి ప్యానెల్ లో సంయుక్త కార్యదర్శి (Joint Secretary) పదవికి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా తనతోపాటు టీం కొడాలి (Team Kodali) ప్యానెల్ లోని ప్రతి ఒక్కరిని గెలిపించవలసిందిగా కోరుతున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected