Connect with us

News

ATA Convention: టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున కి ఆహ్వానం

Published

on

అట్లాంటా (Atlanta) లో వచ్చే సంవత్సరం అమెరికా తెలుగు సంఘం ‘ఆటా’ కన్వెన్షన్ నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఆటా (ATA) 18వ కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్ 2024 జూన్ 7, 8, 9 తేదీలలో జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్ (Georgia World Congress Center) లో నిర్వహించనున్నారు.

ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆటా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆటా వేడుకలలో భాగంగా ఆటా (American Telugu Association) నాయకులు పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే పలువురు ప్రముఖులను ఆటా 18వ కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్ ని ఆహ్వానిస్తున్నారు.

ఈరోజు టాలీవుడ్ గ్లామరస్ హీరో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కలిసి ఆటా కన్వెన్షన్ కి ఆహ్వానించారు. నాగార్జున కూడా పాజిటివ్ గానే స్పందించినట్లు తెలిసింది. స్టైలిష్ హీరో నాగార్జున ని కలిసిన వారిలో ఆటా అధ్యక్షులు మధు బొమ్మినేని (Madhu Bommineni), ఆటా ఉపాధ్యక్షులు జయంత్ చల్లా (Jayanth Challa), కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం (Kiran Pasham) తదితరులు పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected