Connect with us

Festivals

ఆషాడ మాసాన అంబరాన్ని అంటిన TTA బోనాల సంబరాలు @ Seattle, Washington

Published

on

తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (Telangana American Telugu Association – TTA) అధ్యక్షులు శ్రీ వంశీరెడ్డి కంచర కుంట్ల ఆధ్వర్యంలో అమెరికా అంతట ప్రప్రథమంగా తెలంగాణ బోనాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ ఆషాడ మాసమంతా.

ఈ కార్యక్రమంలో భాగంగా వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్ నగర మందు, లాల్ దర్వాజ లష్కర్ బోనాలను మరిపించే విధంగా, తెలంగాణ లోని పుత్రి పల్లెని మైమరిపించే విధంగా, ఘనంగా నిర్వహించారు.

సియోటెల్ ఆడపడుచులందరు బోనమెత్తి, పోతురాజు నృత్యాలతో సాగుతుండగ, తొట్టెలతో ఉత్సవం అట్టహాసంగా సాగింది. సియాటెల్ నగర ప్రజలు, పుర ప్రముఖులు అమ్మ వారిని మేళతాళలతో ఘనంగా స్వాగతించి, పూజలు సమర్పించి తెలంగాణ అమెరికా ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలన్ని ఆశించారు.

ఈ కార్యక్రమం లో 1000 మంది పాల్గోని తెలంగాణ విందు భోజనాన్ని ఆస్వాదించారు. అనేక మంది వాలంటారు. ఆహ్వానితులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండ, ఏర్పాట్లు చేసి కార్యక్రమాన్ని ఘన విజయం చేసారు.

అమెరికాలో ప్రపథమంగా బోనాలను నిర్వహించి, నూతన తరానికి అందిస్తున్న శ్రీ వంశీ రెడ్డి కంచరగుంట్లని, మరియు అతని కార్యవర్గాన్ని ఫైళ్ళ మల్లారెడ్డి గారు, విజయపాల్ రెడ్డి గారు, మెహన్ పటోళ్ళుగారు, భరత్ మాదాడి గారు అభినందించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected