Connect with us

Festivals

అడిలైడ్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో బోనాల పండుగ – Australia

Published

on

బోనాల సందడి ఆషాడ మాసాన విదేశాల్లోనూ మొదలు అయింది. ఆస్ట్రేలియా లోని అడిలైడ్ నగరంలో అడిలైడ్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సంప్రదాయ రీతిలో భోనాలా పండుగ ను నిర్వహించారు.

మహిళలు బోనాలు ఎత్తి నడుస్తుండంగా డప్పు శబ్దాల మధ్య పురుషులు నృత్య విన్యాసాలతో ఉత్సాహంగా కలిసి కుటుంబ సమేతంగా స్థానిక గుడికి వెళ్లి బోనాలు సమర్పించారు.

సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన అందరూ ఆనందంగా గడుపుతూ పూజా కార్యక్రమాల అనంతరం కలిసి మెలిసి ఏర్పాటు చేసుకున్న భోజనాలను అడిలైడ్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో తృప్తి గా స్వీకరించారు.

పండుగ సంప్రదాయాలకు ప్రజలు కనబరుస్తున్న విశేష స్పందనకు అడిలైడ్ తెలంగాణ అసోసియేషన్ నిర్వాహకులు అభినందనలు తెలిపారు. ఇండియాలో చేసుకున్నట్టే ఉందన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments