Connect with us

Language

విద్యార్థుల సమ్మేళనంగా డెట్రాయిట్లో తానా పాఠశాల వార్షికోత్సవం

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘తానా పాఠశాల’ వార్షికోత్సవం డెట్రాయిట్, నోవి లోని శ్రీ వెంకటేశ్వర టెంపుల్లో ఘనంగా జరిగింది. విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు తానా నాయకులు పాల్గొన్న ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేశారు.

తానా బోర్డు చైర్మన్ శ్రీ బండ్ల హనుమయ్య, తానా నార్త్ రీజియన్ రీజినల్ రిప్రజంటేటివ్ శ్రీ శ్రీనివాస్ గోగినేని, తానా చైతన్య స్రవంతి కోఆర్డినేటర్ శ్రీ సునీల్ పాంత్రా, శ్రీ వెంకటేశ్వర టెంపుల్ ట్రస్టీ శ్రీ జోగేశ్వర రావు పెద్దిబోయిన మరియు మిచిగాన్ స్టేట్ ప్రధాన పాఠశాల నిర్వాహకులు మరియు గురువు శ్రీ శ్రీనివాస్ రాజు ధేనువకొండ గారు, గురువులు శ్రీ లక్ష్మి సతీష్ గారు, మరియు శ్రీ హైమ నివేదిత గారి నిర్వహణ లో సాగిన కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు , తానా పాఠశాల అధ్యక్షులు నాగరాజు నలజుల పాఠశాల నిర్వాహకులకు ప్రత్యేక అభినందనల సందేశాన్ని అందించారు. తానా పాఠశాల ప్రతి సెంటర్ లో వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తూ దినదిన ప్రవర్ధమానం చెందుతున్నట్లుంది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected