Connect with us

Service Activities

ఇండియాలో తానా చైతన్య స్రవంతి షెడ్యూల్ విడుదల; అద్భుత కళా ధామం, అంకిత సేవా భావమే నినాదం

Published

on

తానా చైతన్య స్రవంతి 2022 లో అధ్భుతమైన సమాజసేవ, సాంస్కృతిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ప్రపంచం కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్న తరువాత “అంకిత సేవా భావం, అద్భుత కళా ధామం” అనే నినాదంతో ‘తానా’ చైతన్య స్రవంతి ఉభయ తెలుగు రాష్ట్రాలలో డిసెంబర్ 2, 2022 నుండి జనవరి 7, 2023 వరకు నిర్వహించడానికి తానా శ్రీకారం చుట్టింది.

‘తానా చైతన్య స్రవంతి’ కార్యక్రమాల్లో భాగంగా 20 కి పైగా క్యాన్సర్ క్యాంపులు, 30 కి పైగా ఐ క్యాంపులు, 10 కి పైగా సాంస్కృతిక కార్యక్రమాలు, స్కాలర్ షిప్పుల రూపంలో విద్యార్థులకు మిలియన్ డాలర్ల సహాయం, 2500 కు పైగా రైతు రక్షణ పరికరాల పంపిణీ, 500 కు పైగా వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ, పిల్లలు ఆటలు ఆడుకోవడానికి క్రీడా పరికరాల పంపిణీ, సైకిల్ & వీల్ చైర్ల పంపిణీ వంటి కార్యక్రమాలకు ప్రణాళిక రచించారు.

అలాగే ప్రపంచ సాహిత్య వేదిక తో సాహితీ దిగ్గజాలు, ప్రముఖ కవులు, రచయితల ప్రసంగాలు, విభిన్న అంశాల పై చర్చా వేదికలు లాంటి కార్యక్రమాలతో ‘తానా’అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, ‘తానా ఫౌండేషన్’ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ ఆధ్వర్యంలో ‘తానా’ చైతన్య స్రవంతి కోఆర్డినేటర్ సునిల్ పంత్ర సమన్వయంతో మీ ముందుకు వస్తున్నారు.

తానా వారు అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం అంటున్నారు. అందరూ ఈ కార్యక్రమాలలో బంధు మిత్రులు, కుటుంబ సమేతంగా పాల్గొని ‘తానా చైతన్య స్రవంతి 2022’ కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected