Connect with us

Service Activities

మహిళా సాధికారతకు నిలువెత్తు రూపం ‘తానా’రీమణి శిరీష తూనుగుంట్ల

Published

on

శిరీష తూనుగుంట్ల! ఈ పేరు శానా ఏండ్లు యాదుంటది. ఎందుకంటే మహిళా సాధికారత అయినా, సామజిక సేవ అయినా షేర్ లెక్క పనిచేస్తది. అలాగే తనతోపాటు మరో పదిమందిని పోగేసి పనిచెపిస్తది. ఇలా తనకంటూ ఒక ప్రత్యేకతను తెచ్చుకున్న శిరీష బలం బలహీనత కూడా అదే నెమో!

వివరాలలోకి వెళితే.. ఎక్కడో తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెంలో పుట్టి పెరిగి, ఆంధ్రప్రదేశ్ తెనాలి వాసిని వివాహమాడి, 2005 లో అమెరికా విచ్చేసి, కాలక్రమేణ ఒక ఐటీ కంపెనీ స్థాపించి దాదాపు 40 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి, అనంతరం తానా లో ఒక సామాన్య వలంటీర్ స్థాయి నుండి ఇప్పుడు ఏకంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పదవికి పోటీ చేసేలా ఎదగడం చూస్తే మహిళా సాధికారతకు నిలువెత్తు రూపంలా కనిపిస్తుంది శిరీష తూనుగుంట్ల.

అసమాన ప్రతిభా పాఠవాలు కలిగిన శిరీష తూనుగుంట్ల (Sirisha Tunuguntla), ప్రస్తుత తానా ఎన్నికలలో (TANA Elections) 2023-27 కాలానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పదవికి పోటీచేయనున్న తరుణంలో తనకి ఎందుకు ఓటు వేయాలి, తను ఇప్పటి వరకు ఏం చేసింది, తన ఆలోచనలు ఏంటి, తన లక్ష్యాలు ఏంటి, వంటి విషయాలలోకి ఒకసారి తొంగిచూద్దాం.

2011 లో తానా లో ప్రస్థానం మొదలుపెట్టిన శిరీష 2015 వరకు న్యూయార్క్ సిటీ కోఆర్డినేటర్ గా, న్యూయార్క్ ధీం-తానా ఛైర్ గా మరియు న్యూయార్క్ క్యూరీ పోటీల ఛైర్ గా, 2017 వరకు నేషనల్ మెంబర్హిప్ సర్వీసెస్ కోఛైర్ గా, 2019 వరకు నేషనల్ మెంబర్హిప్ సర్వీసెస్ ఛైర్ గా, 2021 వరకు ఉమెన్ సర్వీసెస్ కోఆర్డినేటర్ గా, 2023 వరకు సాంస్కృతిక సేవల సమన్వయకర్తగా అంచలంచలుగా ఎదిగారు.

ఈ సమయంలో శిరీష నిర్వహించిన కార్యక్రమాలు తానా ని మరో మెట్టు పైకి తీసుకెళ్లాయి. వాటిలో 40 దేశాల నుంచి 120 తెలుగు సంఘాలను సమన్వయం చేసుకుంటూ 20 వేల ఆహ్వానితులతో తానా చరిత్రలో మొట్టమొదటిసారి ప్రపంచ తెలుగు సాంస్కృతిక పండుగ (World Telugu Cultural Festival) నిర్వహణ నభూతో నభవిష్యత్. ఈ కార్యకమానికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ (India Book of Records) మరియు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అందుకోవడం విశేషం.

అన్ని జాతీయ తెలుగు సంఘాలు న్యూయార్క్ విశ్వవేదిక అయిన టైమ్ స్క్వేర్‌ (Times Square) లో మన తెలుగు పండుగలు ఎలా నిర్వహించాలా అని సందిగ్ధంలో ఉండగా, మీమాంసని వదిలేసి ఇదిగో ఇలా చేయాలి అంటూ 20 అడుగుల బతుకమ్మను పేర్చి బంగారు బతుకమ్మ అంటూ వరుసగా రెండు సంవత్సరాలపాటు న్యూయార్క్ నడిబొడ్డుపై రీసౌండ్ వచ్చేలా తానా జెండాని రెపరెపలాడించింది శిరీష. న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ (New York Mayor Eric Adams) సైతం హాజరవడం, పండుగని గుర్తించి సైటేషన్ ఇవ్వడం విశేషం.

ప్రతి పదవిలోనూ తన మార్క్ వేసేలా నూతన ఆలోచనలతో అందరికంటే ఒక అడుగు ఎప్పుడూ ముందే ఉంటుంది శిరీష (Sirisha Tunuguntla). ఇందులో భాగం గానే ప్రతి నెలా రెండవ శనివారం రోజున ‘తానా తెలుగు సాంస్కృతిక సిరులు’ అంటూ సరికొత్త కార్యక్రమానికి అంకురార్పణ చేయడం ఈ గడసరికే చెల్లింది.

తెలుగు నేల పలు కళా రూపాలకు పురుడు పోసి, పెంచి పెద్ద చేసి ప్రపంచానికి అందిస్తే, తెలుగు వారి సృజనాత్మకతకు, కళా నైపుణ్యానికి చిహ్నాలైన ఈ కళల్లో కొన్నిఅర కొర ఆదరణతో కొట్టుమిట్టాడుతుండగా మరికొన్ని అవసానదశకు చేరుకున్నాయి. వీటిని ప్రోత్సహించాలనే సంకల్పంతో శిరీష తానా తెలుగు సాంస్కృతిక సిరులు అనే కార్యక్రమానికి రూపకల్పన చేసింది.

సంస్కృతి, సాహిత్యం పట్ల ప్రేమాభిమానాలతో తానా తెలుగు సాంస్కృతిక సిరులు సిరీస్ లో భాగంగా హరికథామృతం, జాన పదం – జ్ఞాన పథం, వీణామృత గాత్ర సంగీత కచేరి, గజల్ గానలహరి, సురభి డ్రామాలు, కావ్య దీపావల్లి వంటి వైవిధ్య భరిత కళలను మరియు కళామతల్లి ముద్దు బిడ్డలైన కళాకారులను (Artists) ప్రోత్సహించే బాధ్యత తీసుకుంది.

ఇంకా ప్రపంచ తెలుగు భాషాదినోత్సవం (World Telugu Language Day), అమ్మా నీకు వందనం అంటూ మదర్స్ డే (Mothers Day), బాలోత్సవం, ఆజాదీకా అమృత మహాత్సవం, మహిళా సాధికారతపై సదస్సులు ఇలా చెప్పుకుంటూ పొతే చేంతాడు అంత పెద్ద లిస్ట్ ఉంటుంది మరి. అందుకే ఇవన్నీ మచ్చు తునకలు మాత్రమే.

అలాగే అమెరికా మరియు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల సహకారంతో 100 కు పైగా గృహ హింస (Domestic Violence) కేసులకు పరిష్కరణ చూపించిన ఘనత శిరీష తూనుగుంట్ల దే. షెల్టర్లు, ఉచిత న్యాయ సహాయం, స్కిల్ డెవలప్మెంట్ (Skill Development) అందించి కష్టకాలంలో ఆ మహిళలకు తోడుగా నిలబడ్డారు.

కోవిడ్ (COVID-19) మహమ్మారి సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలకు 20 వేల మెడికల్ కిట్స్, 650 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, 220 వెంటిలేటర్స్, 24 బై 7 కాల్ సెంటర్, 3 వేల కుటుంబాలకు ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులు ఏర్పాటుచేశారు. ఇంకా 100 మంది కళాకారులకు రెండు వేల చొప్పున ఆర్ధిక సాయం చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు శిరీష.

కోవిడ్ సేవలకు గాను నారీమణి శిరీష తూనుగుంట్ల కి అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ (Biswabhusan Harichandan) రెడ్‌క్రాస్ అవార్డు మరియు బంగారు పతకం ప్రధానం చేశారు. దీంతో తానా (TANA) కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరినట్లయింది.

ఇండియాలో చేనేత కార్మికులకు ఆసు యంత్రాలు, ప్రభుత్వ పాఠశాలలకు బల్లలు, మాతృదినోత్సవం సందర్భంగా మాతృమూర్తులకు చీరలు అందించారు. గోదావరి వరద బాధితులకు ఫండ్స్ రైజ్ చేశారు. అలాగే న్యూయార్క్ (New York) లో 5కే రన్, బ్యాక్ప్యాక్ ప్రాజెక్ట్, సీపీఆర్ & ఏఈడి (CPR & AED) శిక్షణ, టీం స్క్వేర్ ఇన్సిడెంట్స్ సమన్వయం చేశారు.

అంతే కాకుండా తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA of New York) లాంటి స్థానిక తెలుగు సంఘాలలో సైతం సేవలందించిన అనుభవం శిరీష సొంతం. మైకు దొరికితే ‘మహిళా సాధికారత’ అంటూ ప్రతి ఒక్కరూ ఊక దంపుడు ఉపన్యాసాలతో నినాదాలు ఇస్తుంటారు. మరి ఆచరణలో కూడా ఆ నినాదాన్ని విధానపరంగా ప్రోత్సహించేలా తనకు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నారు.

మహిళలకు సహజంగానే బహుముఖ సామర్ధ్యం ఉంటుందని, దాని వల్ల సంక్షోభాలను ఎదుర్కొన్నప్పటికీ నారీ శక్తిని కూడగట్టి, తన అనుభవాన్నంతటినీ రంగరించి అంకితభావంతో, వెనకడుగు వెయ్యకుండా పరిష్కారాలు చూపగలిగే తన నైజంతో మహిళా సాధికారతను (Women Empowerment) నినాదం నుంచి విధానం వరకు తీసుకెళ్తానంటూ సూటిగా సుత్తి లేకుండా చెప్తున్నారు శిరీష.

తనను గెలిపిస్తే ముందుగా తానా సభ్యులకు ప్రతి రెండు సంవత్సరాలకు ఎన్నికల గోల తగ్గేలా తానా రాజ్యాంగ సవరణలపై ద్రుష్టి పెడతానన్నారు. రాజకీయాలకు అతీతంగా, పారదర్శకత మరియు జవాబుదారీతనం పెరిగేలా చూస్తానన్నారు. కాబట్టి తనతోపాటు టీం వేమూరి (Team Vemuri) ప్యానెల్ లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసి గెలిపించవలసిందిగా అభ్యర్థిస్తున్నారు మన ‘తానా’రీమణి శిరీష తూనుగుంట్ల.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected