Connect with us

Politics

కోలాహలంగా లాస్ ఏంజలస్ ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల పండుగ

Published

on

అమెరికాలోని లాస్ ఏంజలస్ నగరంలో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కోలాహలంగా నిర్వహించారు. అమెరికాలోని 40 నగరాల్లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణలో భాగంగా కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజలస్ నగరంలో కూడా వేడుకలు విజయవంతమయ్యాయి.

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు మరియు తెలుగుదేశం పార్టీ వీరాభిమాని తన స్వగృహంలో ఏర్పాటు చేసుకున్న ఎన్టీఆర్ నిలువెత్తు విగ్రహానికి నివాళుర్పించారు. ఈ కార్యక్రమంలో జోహార్ ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై జై తెలుగుదేశం నినాదాలతో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.

అలాగే తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జండాలు, ఎన్టీఆర్, చంద్రబాబు మరియు పార్టీ బ్యానర్స్ తో వేదికంతా అలంకరించారు. జోహార్ ఎన్టీఆర్, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం అంటూ వేదికను మార్మోగించారు. దీంతో కోలాహలంగా తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల పండుగ ముగిసింది.

error: NRI2NRI.COM copyright content is protected