. బోస్టన్‌లో ఘనంగా TANA న్యూ ఇంగ్లాండ్ ‘నందమూరి అందగాడు’ . వర్ష హెచ్చరికలను లెక్కచేయకుండా నందమూరి అందగాడు సంగీత కార్యక్రమంకు పోటెత్తిన తెలుగు పాటల అభిమానులు . 16 మంది గాయకులతో మధు చారి మధురవాణి బృందం పాటలతోటి తెలుగు పాటల వర్షపు తూఫాన్
Groton, Boston, Massachusetts: అమెరికాలోని బోస్టన్‌లో సెప్టెంబర్ 26న జరిగిన ‘నందమూరి అందగాడు’ సంగీత కార్యక్రమం తెలుగు పాటల అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. తీవ్ర వర్షాలు, వాతావరణ హెచ్చరికలు జారీ అయినప్పటికీ కార్యక్రమానికి 200 మందికి పైగా ప్రేక్షకులు హాజరై తెలుగు సినీ సంగీతంపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.
అమెరికాలోని అతిపెద్ద సాయిబాబా ఆలయంగా ప్రసిద్ధి చెందిన శిరిడీ సాయిబాబా ఆలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని TANA న్యూ ఇంగ్లాండ్ ఆధ్వర్యంలో, మధురవాణి మ్యూజికల్ గ్రూప్ సహకారంతో నిర్వహించారు. నందమూరి తారక రామారావు (NTR) నటించిన చిత్రాల్లోని ఆణిముత్యాల్లాంటి పాటలను ఒకే వేదికపై వినిపిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం ఆద్యంతం సంగీతాభిమానులను ఆకట్టుకుంది.
పాత తరం తెలుగు సినీ సంగీతంలోని మాధుర్యాన్ని నేటి తరానికి పరిచయం చేస్తూ సాగిన పాటలు ప్రేక్షకులను గత జ్ఞాపకాలలోకి తీసుకెళ్లాయి. వర్షం కారణంగా రాకపోకలకు ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రేక్షకులు కుటుంబ సమేతంగా కార్యక్రమానికి తరలివచ్చారు. ప్రముఖ గాయకుడు మధు చారి నాయకత్వంలో మధురవాణి మ్యూజికల్ గ్రూప్‌కు చెందిన 16 మంది ప్రతిభావంతులైన గాయకులు NTR గారి పలు ప్రసిద్ధ గీతాలను ఆలపించారు.
గాయకుల సమన్వయం, పాటల ఎంపిక, సంగీత బృందం ప్రదర్శనకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. సుప్రసిద్ధ మ్యూజిక్ డైరెక్టర్ కీర్తి శేషులు పెండ్యాల నాగేశ్వర రావు గారి కుమార్తె పెండ్యాల సుజాత ప్రత్యేకఅతిధిగా విచ్చేసారు. చాలా రోజుల తరువాత నాన్నగారి పాటలని స్టేజి మీద విన్నాను, నాన్నగారి చిత్రాలలోని పాటల కొన్ని సన్నివేశాలు ని గుర్తుకు తెచుకున్నారు, నందమూరి అందగాడు ఈవెంట్ నిర్వహులందరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ప్రతి పాట అనంతరం ప్రేక్షకుల నుంచి చప్పట్లతో అభినందనలు వెల్లువెత్తాయి. NTR అభిమానులు, తెలుగు సంగీతాభిమానులు ప్రత్యేకంగా కార్యక్రమాన్ని ఆస్వాదించారు. ఒకవైపు వర్షపు తూఫాన్ వాతావరణం, మరోవైపు తెలుగు పాటలపై ఉన్న అభిమానంతో ప్రేక్షకులు కార్యక్రమానికి హాజరుకావడం నిర్వాహకుల్లో ఉత్సాహాన్ని నింపింది.
ఈ కార్యక్రమంలో TANA న్యూ ఇంగ్లాండ్ కోఆర్డినేటర్లు మౌనిక మానుకొండ (Mounika Manikonda), యెండూరి శ్రీనివాస్, రావు యలమంచిలి, కృష్ణ ప్రసాద్ సోంపల్లి (Krishna Prasad Sompally) పాల్గొన్నారు. Telugu Association of Greater Boston (TAGB) అధ్యక్షురాలు సుధ ముల్పూర్ (Sudha Mulpur) తన బృందంతో కలిసి కార్యక్రమానికి హాజరై కళాకారులను, నిర్వాహకులను అభినందించారు.
ఆమెతో పాటు TAGB మాజీ అధ్యక్షులు నలుగురు కూడా కార్యక్రమానికి హాజరై తమ మద్దతు తెలిపారు. TAGB మాజీ BOT చైర్మన్ రావి అంకినీడు (Ravi Ankineedu) అండ్ టీం ప్రేక్షకులని ఉత్తేజ పరిచారు. S4 Media & Source Group of Companies CEO శ్రీని బొల్ల కార్యక్రమానికి హాజరై కళాకారులను అభినందించారు. TAGB మాజీ అధ్యక్షులు బాబు రావు పొలవరపు కార్యక్రమంలో పాల్గొన్న గాయకులు, కళాకారులందరికీ ట్రోఫీలను అందజేశారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడంపై TANA అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి (Dr. Naren Kodali) తన సందేశంలో TANA న్యూ ఇంగ్లాండ్ రీజియన్ నాయకత్వాన్ని, వాలంటీర్లను అభినందించారు. ప్రత్యేకంగా రమణ తిరువీధి, త్రిభు పారుపల్లి, శ్రీనివాస్ కాకి, గోపీ నెక్కలపూడి, వేణు కూనంనేని, భార్గవ్ ప్రక్కి తదితర వాలంటీర్లు కార్యక్రమం విజయవంతం కావడానికి అందించిన సహకారాన్ని ఆయన ప్రశంసించారు.
ప్రేక్షకులను కార్యక్రమంతో అనుసంధానిస్తూ, కార్యక్రమాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్లిన అరుణ్ ముల్పూర్ MCగా అందించిన సేవలను ప్రత్యేకంగా అభినందించారు. కృష్ణ ప్రసాద్ సోంపల్లి (KP Sompally) తానా ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ తన ప్రసంగములో కొన్ని సంఘటలను చూస్తే కంట తడి పెట్టుకోవాలి వస్తుంది అన్నారు.
అమెరికా లో వున్న ప్రతి NRI అవకాశం వున్నపుడు తమకు ఎదురుపడే స్టూడెంట్స్, Visitors, పిల్లల దగ్గరకు వచ్చే పేరెంట్స్ కు అమెరికా రూల్స్ అండ్ Regulations రాత్ గయే బాత్ గయే లాగా కాకుండా ఒకటి రెండు సార్లు, అమెరికా రూల్స్ గూర్చి చెప్పాలిసి భాద్యత ప్రతి NRI మీద వుంది అన్నారు. An Ounce of prevention worth a Pound of Cure అని సమాజానికి పిలుపునిచ్చారు.
తెలుగు పాటలు, NTR గారి చిత్రాలపై ఉన్న అభిమానాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చిన ఈ కార్యక్రమం ద్వారా బోస్టన్ తెలుగు సమాజంలో సాంస్కృతిక అనుబంధం మరోసారి ప్రతిబింబించింది. ‘నందమూరి అందగాడు’ కార్యక్రమం కేవలం ఒక సంగీత కార్యక్రమంగా కాకుండా.. తెలుగు సినీ సంగీత వైభవాన్ని, NTR గారి కళా వారసత్వాన్ని గుర్తుచేసిన ఒక ప్రత్యేక సాంస్కృతిక వేడుకగా నిలిచింది.
ప్రతికూల వాతావరణాన్ని సైతం లెక్కచేయకుండా 200 మందికి పైగా తెలుగు పాటల అభిమానులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. TANA న్యూ ఇంగ్లాండ్ నాయకత్వం (TANA New England Chapter), మధురవాణి మ్యూజికల్ గ్రూప్, గాయకులు, వాలంటీర్లు, సహకరించిన సంస్థల ప్రతినిధులు మరియు కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులందరికీ మౌనిక మానుకొండ కృతజ్ఞతలు తెలిపారు. ప్రేక్షకులు 2027 మెగా ఈవెంట్ ని తానా, మధురవాణి మ్యూజికల్ గ్రూప్ సమన్మయం తోటి ప్రేక్షకులని అలరించాలని ఆకాంక్షించారు.