Connect with us

Music

SPB Music Academy @ New York: హృదయాన్ని తాకే సంగీత నివాళులతో బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతి వేడుకలు

Published

on

ఎస్‌పీబీ మ్యూజిక్ అకాడమీ (SPB Music AcademySPBMA) ఆధ్వర్యంలో నిర్వహించిన గాన గంధర్వుడు శ్రీ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గారి 80వ జయంతి వేడుకలకు (Birthday Celebrations) న్యూయార్క్ (New York) తెలుగు సమాజం అందించిన అపూర్వ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు. సంగీత మాధుర్యం, మధుర స్మృతులు, హృదయాన్ని తాకే సంగీత నివాళులతో ఈ కార్యక్రమం చిరస్మరణీయ సంగీత విభావరిగా నిలిచింది.

ప్రత్యేక అతిథిగా విచ్చేసిన డా. శరత్ చంద్ర గారు “స్వర వైభవరి” కార్యక్రమం ద్వారా గాన మహానుభావులు శ్రీ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం (Sripathi Panditaradhyula Balasubrahmanyam) గారు, శ్రీ ఘంటసాల (Ghantasala Venkateswara Rao) గారికి సంగీత నివాళులు అర్పించారు. మరో ప్రత్యేక అతిథి మిమిక్రీ రమేష్ గారు తన సహజ హాస్యంతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా, తన అద్భుత గానంతో కూడా అందరినీ ఆకట్టుకున్నారు.

ఈ కార్యక్రమానికి తమ బృందాలతో విచ్చేసిన న్యూయార్క్ జాతీయ, స్థానిక తెలుగు సంఘాల (Telugu Associations) నాయకత్వానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అమెరికాలోని పలు రాష్ట్రాల నుంచి గాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డా. శరత్ చంద్ర గారు గాయకులను అభినందిస్తూ, సంగీతంపై (Music) ఆసక్తిని పెంపొందిస్తున్న బాల ప్రతిభల తల్లిదండ్రులను ప్రత్యేకంగా ప్రశంసించారు.

కష్టమైన వీకెండ్ ట్రాఫిక్ మధ్య కూడా కుటుంబాలతో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గాయకులకు, సంగీతాభిమానులకు మా ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీమతి పద్మ కొడెల గారు మరియు వారి కుమార్తె రూపొందించిన అద్భుత అలంకరణలు (Decoration) సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

“Balu” అక్షరాలతో అలంకరించిన భారీ “80” కాన్వాస్, పూల అలంకరణలు, రంగురంగుల తోరణాలు సభా వేదికను సంగీతోత్సవ వాతావరణంగా మార్చాయి. SPBMA చైర్మన్ డా. హరి ఎప్పనపల్లి గారు సంగీతానికి అంకితభావంతో పనిచేస్తున్న గాయకులను అభినందిస్తూ, భావి తరాల గాయకులను తీర్చిదిద్దేందుకు SPB Music Academy (SPBMA) నిరంతరం శిక్షణ, మార్గదర్శకత్వం అందిస్తుందని తెలిపారు.

ఈ సందర్భంగా డా. హరి ఎప్పనపల్లి గారు, అధ్యక్షుడు శ్రీనివాస్ గూడూరు (Srinivas Guduru) గారు, ఉపాధ్యక్షురాలు రాజీ బుర్ర గారు, కార్యవర్గ సభ్యుడు కుమార్ బుద్ధరాజు గారు మరియు పలువురు సంఘ నాయకులు కలిసి, ఘంటసాల సంగీత పరిరక్షణకు, వేలాది మంది విద్యార్థులకు సంగీత (Music) శిక్షణ అందించేందుకు చేసిన విశేష సేవలకు గాను డా. శరత్ చంద్ర గారిని “గాన కళా తపస్వి” బిరుదుతో ఘనంగా సత్కరించారు.

అలాగే మిమిక్రీ రమేష్ (Mimicry Ramesh) గారిని కూడా ఘనంగా సన్మానించి, వారి అమెరికా పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా పర్యటించి, అనేక సంఘాల నుంచి సత్కారాలు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి కళాకారుడిగా మిమిక్రీ రమేష్ గారు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. నసావ్ కౌంటీ (Nassau County) ఎగ్జిక్యూటివ్ బ్రూస్ బ్లేక్‌మన్ కార్యాలయం తరఫున శ్రీమతి జింగ్ జావో గారు విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

తెలుగు సంఘాలకు, తెలుగు సమాజానికి అందిస్తున్న సహకారానికి SPBMA తరఫున నసావ్ కౌంటీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. SPBMA సలహాదారు, IGNOU డైరెక్టర్, మీడియా నిపుణుడు మరియు భారత ప్రభుత్వ మీడియా వ్యవహారాల సలహాదారు డా. రవి అయ్యగారి గారు, SPBMA బోర్డు సభ్యురాలు శ్రీమతి సుజాత వేమ్పరాల గారు కూడా కార్యక్రమ విజయానికి తమ శుభాకాంక్షలు తెలిపారు.

మహేష్ దొమల గారు, విజయేందర్ బాస గారు, రామ వనమ గారు, కుమార్ బుద్ధరాజు గారు, ప్రసాద్ సానపతి గారు కార్యక్రమానికి లాజిస్టిక్ సహకారం అందించారు. పలువురు సంఘ నాయకులు, సభ్యులు, సంగీతాభిమానులు హాజరై కార్యక్రమానికి మరింత వన్నె తెచ్చారు. ఈ సంగీత నివాళి కార్యక్రమాన్ని చిరస్మరణీయ విజయంగా నిలిపిన ప్రతి ఒక్కరికీ SPB మ్యూజిక్ అకాడమీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తోంది.

error: NRI2NRI.COM copyright content is protected