Connect with us

Eye Camp

వెంకట రమణ యార్లగడ్డ అతిథిగా పామర్రులో తానా ఫౌండేషన్ నేత్ర వైద్య శిబిరం

Published

on

కృష్ణా జిల్లా పామర్రులో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) ‘తానా ఫౌండేషన్, కృష్ణా మిల్క్ యూనియన్ మరియు రోటరీ క్లబ్ వారు సంయుక్తంగా మెగా ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. పామర్రు మండలంలోని స్థానిక పాలకేంద్రం లో జనవరి 20 శుక్రవారం రోజున ఈ శిబిరాన్ని నిర్వహించారు.

తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ ముఖ్య అతిథిగా హాజరయ్యి ఈ మెగా ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. మొత్తం 774 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించగా 111 మంది కాట్రాక్టు సర్జరీ అవసరమైన వారు ఉన్నారు. అలాగే అవసరమైన 663 మందికి ఉచితంగా కళ్ళజోళ్లు అందజేశారు.

ఈ ఉచిత మెగా నేత్ర వైద్య కార్యక్రమంలో తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ (Venkata Ramana Yarlagadda) తోపాటు కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిదారుల యూనియన్ అధ్యక్షులు చలసాని ఆంజనేయులు, గ్రామ పెద్దలు మరియు దాదాపు 800 మంది రైతులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ మాట్లాడుతూ తానా నిర్వహిస్తున్న పలు సేవాకార్యక్రమాలను వివరించారు. మిగతా నేతల ప్రసంగాల అనంతరం వెంకట రమణ యార్లగడ్డ ని శాలువా మరియు మెమెంటోతో ఘనంగా సన్మానించారు.

పామర్రు గ్రామ వాసులు పెద్ద ఎత్తున పాల్గొని తానా ఫౌండేషన్ సేవలను వినియోగించుకోవడం విశేషం. పురుషోత్తమ చౌదరి గుడే ఈ తానా ఫౌండేషన్ మెగా ఉచిత నేత్ర వైద్య శిబిరాలకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. వేదికపైనున్న పెద్దలు, గ్రామస్తులు తానా ఫౌండేషన్ సేవలను అభినందించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected