Connect with us

Conference

తానా కన్వెన్షన్ కిక్ ఆఫ్ & ఫండ్రైజర్ బ్యాంక్వెట్ విజయవంతం @ Raleigh, North Carolina

Published

on

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (Telugu Association of North America) ‘తానా’ 23వ మహాసభలు ఫిలడెల్ఫియా (Philadelphia) మహానగరంలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో 2023 జులై 7, 8, 9 తేదీలలో ఘనంగా నిర్వహించనున్న విషయం అందరికీ విదితమే.

ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ తానా మహాసభలు (TANA Conference) అంజయ్య చౌదరి లావు అధ్యక్షతన రవి పొట్లూరి కన్వీనర్ గా ఘనంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే పలు నగరాలలో ఫండ్రైజర్ (Fundraiser) కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులో భాగంగా తానా బృందం మే 14 ఆదివారం రోజున నార్త్ కరోలినా (North Carolina) రాష్ట్రం, ర్యాలీ (Raleigh) నగరంలో తానా కన్వెన్షన్ కిక్ ఆఫ్ & ఫండ్రైజర్ బ్యాంక్వెట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమీకరించిన నిధుల పట్ల అందరూ తమ సంతృప్తిని తెలియజేస్తూ సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

డర్హం (Durham) లోని సీజన్స్ ఎట్ తందూర్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంజయ్య చౌదరి లావు, జానీ నిమ్మలపూడి, ఉమ కటికి ఆరమండ్ల, సురేష్ కాకర్ల, రాజేష్ యార్లగడ్డ, శ్రీనివాస్ కూకట్ల, ఠాగూర్ మల్లినేని, రామకృష్ణ అల్లు, హరీష్ కూకట్ల తదితరులతోపాటు అనేకమంది స్థానికులు పాల్గొని విజయవంతం చేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected