Connect with us

Conference

తానా 23వ మహాసభల సమన్వయ కమిటీల సమావేశం @ Norristown, Pennsylvania

Published

on

ఉత్తర అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం, నారిస్ టౌన్ లో ఏప్రిల్ 15వ తేదీన ప్రతిష్టాత్మక తానా 23వ మహాసభల (Convention) సమన్వయ కమిటీల సమావేశం జరిగింది. జులై 7, 8, 9వ తేదీలలో పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో తానా (TANA) 23వ మహాసభలు నిర్వహించనున్న సంగతి విదితమే.

ఈ తానా మహాసభలను జయప్రదం చేసేందుకు ప్రస్తుత కార్యాచరణ, మహాసభల అతిధుల ఏర్పాట్లు మరియు ఇతర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో డెలావేర్, న్యూ జెర్సీ, పెన్సిల్వేనియా రాష్ట్రాల నుండి మహాసభల కమిటీల సభ్యులు హాజరై వారి కమిటీల పురోగతి స్థితులను, సమగ్ర ప్రణాళికలను వివరించారు.

ఈ సందర్భంగా అక్కడకి వచ్చిన కమిటీ సభ్యులు.. తానా (Telugu Association of North America) వ్యవస్థాపకులు, తొలి అధ్యక్షులు స్వర్గీయ శ్రీ కాకర్ల సుబ్బారావు (Kakarla Subbarao) గారి ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకుని ఘన నివాళులు అర్పించారు. అలాగే కాకర్ల సుబ్బారావు గారి సేవలను కొనియాడారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected