Connect with us

Social Service

చికాగోలో తానా సేవలను అభినందించిన ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్ సంస్థ

Published

on

ప్రపంచంలో తినడానికి తిండి లేక కొందరు, ఒకవేళ ఉన్నా అందులో సరైన పోషకాలు లేక ఇంకొందరు అనారోగ్యాల పాలై చనిపోతున్నారు. ముఖ్యంగా 5 సంవత్సరాల లోపు పిల్లల్లో ఈ ఇబ్బంది ఎక్కువగా ఉంది. వివిధ పరిశోధనల ప్రకారం ప్రతి సంవత్సరం వివిధ దేశాల్లో సుమారు 6 వేల మంది చిన్నారులు ఈ కారణంగా చనిపోతున్నారు.

దీంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఎప్పటిలానే తమ వంతు సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. తానా ఉమెన్ సర్వీసెస్ కోఆర్డినేటర్‌ డా. ఉమా ఆరమండ్ల కటికి ఆధ్వర్యంలో ఇలినాయిస్ రాష్ట్రం, అరోరా నగరంలోని ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్ అనే సంస్థ ద్వారా తోడ్పాటు అందించారు.

40 మంది స్థానిక పెద్దలు, పిల్లలు తానా తరపున సెప్టెంబర్ 24 శనివారం రోజున ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్ సంస్థలో ఫుడ్ ప్యాకింగ్ చేయడానికి వలంటీర్ సేవలు అందించారు. 30 మంది బయటి వాలంటీర్లతో కలిపి 4 స్టేషన్లలో 27 వేల మంది పిల్లలకు సరిపోయే పోషకాహారాన్ని ప్యాక్ చేశారు.

ఒక్కో బాక్సులో 36 ప్యాక్స్ చొప్పున, ఒక్కో స్టేషన్లో 25 బాక్సులు సిద్ధం చేశారు. ఒక ప్యాక్ ఒక చిన్నారి లంచ్ కి సమానం. ఇందులో రైస్, సోయా, డ్రై వెజిటబుల్స్, విటమిన్లు వంటివి ఉంటాయి. మొత్తంగా 126 బాక్సుల్లో సుమారు 75 మంది చిన్నారులకు ఒక సంవత్సరం మొత్తానికి సరిపడే పోషకాహారాన్ని రెడీ చేశారు.

కంటైనర్స్ ద్వారా వీటిని ఆఫ్రికా తదితర పేద దేశాలకు తరలించి పిల్లలకు అందిస్తారు. ఈ కార్యక్రమం చివర్లో సందర్భానుచితంగా అన్నపూర్ణ స్తోత్రం ఆలపించి ముగించడం, దీనికి ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్ సంస్థ వారు అంగీకరించడం విశేషం. ఈ సందర్భంగా తానా సేవలను ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్ సంస్థ వారు అభినందించారు.

తానా ఉమెన్ సర్వీసెస్ కోఆర్డినేటర్‌ డా. ఉమా ఆరమండ్ల కటికి తోపాటు హేమ అద్దంకి, సంధ్య అద్దంకి, శాంతి లక్కంసాని, శ్రీదేవి దొంతి, బ్రాహ్మిణి శనక్కాయల, శ్రీదేవి ఎం, రాధిక గరిమెళ్ళ, మైథిలి పిట్టల, శ్రావ్య, శశి, సీత మెర్ల, శ్రావ్య మందపాటి, శ్రేయ మందపాటి, రమేష్ ఏ, గోపాలకృష్ణ మూర్తి గరిమెళ్ళ, లలిత గరిమెళ్ళ, అదితి కె, అనిత కాట్రగడ్డ, శ్రీనివాస్ మందపాటి, చంద్రిక రావి, పవిత్ర కొడిగల్, ఆన్య కొడిగల్, అక్షత మవతూర్, శైలజ చిట్టూరి, షణ్ముఖ్ సాయి ఏ, రుద్ర సాయి, సంజన బలప, తాన్య బలప, తరుణ్ బలప, సుభాషిణి నసక, శ్రీదేవి మల్లంపల్లి, వేణి శనక్కాయల, శిరీష సజ్జా, సాన్వి సజ్జా, యోజన గండూరి, రచిత గండూరి, సహస్ర పిట్టల, గుర్ప్రీత్ సింగ్, కిరణ్ వంకాయలపాటి, సునీత రాచపల్లి, శ్రీలత గరికపాటి, సీత మెర్ల ఈ వాలంటీర్ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

అలాగే తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, రాజా కసుకుర్తి, డా. చౌదరి జంపాల, హను చెరుకూరి, హేమ కానూరు, యుగంధర్ యడ్లపాటి, కృష్ణ మోహన్ చిల్మకూర్, హరీష్ కొలసాని, చిరంజీవి గల్లా, రవి కాకర తదితరులు తమ సహకారాన్ని అందించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected